గాడ్ ఫాదర్ లూసిఫర్ ని దాటిందా?

Purushottham Vinay
మెగాస్టార్ చిరంజీవి హీరోగా గాడ్ ఫాదర్ సినిమా విడుదలైన సంగతి తెలిసిందే.ఈ సినిమాని మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన లూసిఫర్ అనే సినిమాకి తెలుగు రీమేక్ గా రూపొందించారు.దసరా సందర్భంగా ఈ సినిమా అక్టోబర్ 5వ తేదీన తెలుగు, సౌత్ భాషాలతో సహా హిందీ భాషలో కూడా విడుదలైంది. మోహన్ రాజా డైరెక్షన్లో రూపొందిన ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ కూడా నటించడంతో హిందీ మార్కెట్ వర్కౌట్ అవుతుందనే ఉద్దేశంతో దాన్ని హిందీ డబ్బింగ్ చేయించి రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో సినిమా విడుదలైన పది రోజుల తర్వాత తమిళంలో కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా కలెక్షన్స్ విషయంలో మాత్రం ముందు నుంచి కాస్త వ్యత్యాసం అయితే కనిపిస్తుంది. సినీ ట్రేడ్ వర్గాల వారి నుంచి బయటకు వస్తున్న సమాచారానికి సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటిస్తున్న సమాచారానికి చాలా తేడా ఉంటుంది.ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ దక్కింది కానీ కలెక్షన్స్ మాత్రం పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి.


లూసిఫర్ సినిమా కేవలం మలయాళంలో మాత్రమే  విడుదలైంది. అయితే ఆ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు 160 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.కానీ గాడ్ ఫాదర్ సినిమా తెలుగు తమిళ హిందీ వర్షన్స్ అన్నీ కలిపినా 100 కోట్లు మాత్రమే దాటాయి అంటే దాదాపు 60 కోట్ల రూపాయల వ్యత్యాసం ఇక్కడ కనిపిస్తుంది. నిజానికి గాడ్ ఫాదర్ సినిమా విడుదలైనప్పటి నుంచి మలయాళంలో ఉన్న మోహన్ లాల్ ఫ్యాన్స్ గాడ్ ఫాదర్ ని దారుణంగా టోల్ చేస్తూ వచ్చారు. దానికి కారణం మెగాస్టార్ చిరంజీవి ఒక ప్రమోషనల్ ఈవెంట్ లో మాట్లాడుతూ లూసిఫర్ సినిమాలో తనకు కొన్ని పాయింట్స్ నచ్చలేదని ఆ పాయింట్స్ ని సరి చేస్తూ ఈ సినిమాను రూపొందించామని చెప్పుకొచ్చారు.ఆయన అన్నట్లుగానే ఆ పాయింట్స్ సరి చేస్తూ చేసిన సినిమా తెలుగు ప్రేక్షకులకు నచ్చింది కానీ థియేటర్లకు వెళ్లి మాత్రం ఆదరించడం జరగలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: