"నేనే వస్తున్నా" మూవీ అఫీషియల్ "ఓటిటి" విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటులలో ఒకరు అయినటు వంటి ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ధనుష్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో విడుదల చేసి ,  వాటిలో కొన్ని మూవీ లతో అద్భుతమైన విజయాలను టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకొని ,  ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా ధనుష్ మంచి క్రేజ్ ఉన్న హీరోగా కేరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ధనుష్ "తిరు" అనే మూవీ తో తమిళ మరియు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు.
 

అలా తిరు అనే మూవీ తో మంచి విజయాన్ని తమిళ మరియు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ హీరో తాజాగా నేనే వస్తున్నా అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ తెలుగు లో కూడా విడుదల అయింది. ఈ మూవీ కి సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించాడు. ఇది ఇలా ఉంటే మంచి అంచనాల నడుమ విడుదల అయిన నేనే వస్తున్నా మూవీ తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ "ఓ టి టి" స్ట్రీమింగ్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. ప్రముఖ "ఓ టి టి" సంస్థలలో ఒకటి అయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ ని అక్టోబర్ 27 వ తేదీ నుండి తెలుగు భాషలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ,  అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ తాజాగా ప్రకటించింది. మరి ఈ మూవీ "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. ఎవరైనా ఈ మూవీ ని థియేటర్ లలో చూద్దాం అని  మిస్ అయిన వారు ఉంటే అక్టోబర్ 27 వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కాబోతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: