మెగా ఈవెంట్ కి ఆ నందమూరి హీరో రాబోతున్నాడా..!!

murali krishna
అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గౌరవం అనే సినిమాతో టాలీవుడ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మరి.
సినిమా బాగానే ఉన్నా అల్లు శిరీష్ కి మాత్రం పెద్దగా క్రేజ్ దక్కలేదు అని చెప్పవ్చును . ఆ తర్వాత కూడా కొత్తజంట, ఏబిసిడి, శ్రీరస్తు శుభమస్తు, ఒక్క క్షణం వంటి సినిమాలతో ప్రేక్షకులను అలకరించే ప్రయత్నం చేశారు. కానీ తన సోదరుడు అల్లు అర్జున్ కి దక్కిన క్రేజ్ మాత్రం అల్లు శిరీష్ కి తగ్గలేదు. అయినా సరే అల్లు అరవింద్ మాత్రం తన కుమారుడిని ఎలా అయినా హీరోగా నిలబెట్టాలనే ప్రయత్నాలు విపరీతంగా చేస్తూనే ఉన్నారు.
ఇక అల్లు శిరీష్ అను ఇమ్మానియేల్ తో కలిసి ఊర్వశివో రాక్షసివో అనే సినిమా కూడా చేశారు. రాకేష్ శశి ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరించారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో మొన్నటి వరకు  ఒక క్లారిటీ  కూడా లేదు. కానీ కొన్ని రోజుల క్రితం ఈ సినిమాని నవంబర్ 4వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఇప్పటికే ఇంటర్వ్యూలలో పాల్గొంటూ తన సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్టోబర్ 30వ తేదీన హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహించేందుకు అల్లు అరవింద్ ప్లాన్ చేసినట్లు చెబుతున్నారు.
ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నందమూరి బాలకృష్ణ ముఖ్యఅతిథిగా హాజరయ్యే అవకాశం ఉందని ప్రచారం జోరుగా జరుగుతోంది. నందమూరి బాలకృష్ణ ఆహా వీడియోలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బికె అనే ప్రోగ్రాంకి హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన మొదటి సీజన్ విజయవంతంగా పూర్తయింది, రెండో సీజన్లో షూటింగ్ కూడా మొదలైంది. ఇప్పటికే రెండు ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి ప్రతి శుక్రవారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటుంది ఆహా వీడియో యాజమాన్యం.
ఈ నేపథ్యంలోనే అల్లు అరవింద్ బాలకృష్ణ మధ్య మంచి సాన్నిహిత్య సంబంధాలు బాగా ఏర్పడ్డాయి. ఒకప్పుడు సీనియర్ ఎన్టీఆర్ అల్లు రామలింగయ్య మధ్య ఎలాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో ఇప్పుడు తమ మధ్య కూడా అంత మంచి స్నేహం ఉందని ఆ మధ్య బాలకృష్ణ కూడా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తన స్నేహితుడి కుమారుడి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అడగగానే బాలకృష్ణ వచ్చేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఈ ఈవెంట్ కి కేవలం నందమూరి బాలకృష్ణ ఒక్కరే హాజరవుతారా? అల్లు శిరీష్ సోదరుడు అల్లు అర్జున్ కూడా హాజరవుతారా అనే విషయం మీద మాత్రం ఒక క్లారిటీ లేదు. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఎక్కువగానే కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: