సీనియర్ స్టార్లకు అగ్ని పరీక్ష....!

murali krishna
గ తంలో దక్షిణాది పరిశ్రమను ఏలిన సీనియర్ స్టార్లు శరవేగంగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఒకప్పటి బాక్సాఫీస్ స్పందన రాబట్టుకోవడంలో మాత్రం తడబడుతున్నారు.ఇటీవలి పరిణామాలు దానికి ఉదాహరణగా నిలుస్తున్నాయి. దీపావళి కానుకగా ఇటీవలే విడుదలైన మోహన్ లాల్ మాన్స్టర్ కు చాలా యావరేజ్ ఓపెనింగ్స్ వచ్చాయి. టాక్ అండ్ రివ్యూస్ బాలేనప్పటికీ అసలు మొదటి ఆటకే అభిమానుల సందోహం అంతగా కనిపించలేదు. ఇది ట్రేడ్ ని సైతం ఆశ్చర్యపరిచింది. ఇదేంటి కంప్లీట్ యాక్టర్ కి ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని విశ్లేషణలో పడ్డారు. పక్కన రజనీకాంత్ కు ఇతర భాషల్లో ఈ తరహా పరిస్థితే నెలకొంది.
అక్కడే కాదు మనదగ్గరా ఇలాంటి సందర్భాలు చూస్తున్నాం. మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ కు అన్నీ సానుకూలంగా వచ్చాయి. మొదటి నాలుగు రోజులు కలెక్షన్లతో థియేటర్లు కళకళలాడాయి. తీరా చూస్తే మొదటి సోమవారానికే గ్రాఫ్ అమాంతం పడిపోయింది. వీకెండ్స్ కొంత పికప్ చూపించినా ఫైనల్ గా ఆశించిన స్థాయిలో రికార్డులు అందుకోలేకపోవడం కళ్ళముందు కనిపిస్తోంది. నాగార్జున ది ఘోస్ట్ బాలేదన్నది పక్కనపెడితే ఫస్ట్ డే ఫస్ట్ షోకు పండగ రోజు పబ్లిక్ పెద్దగా కనిపించకపోవడం అక్కినేని అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ఒకప్పుటి కింగ్ మార్కెట్ ఏమైందని అంతర్మథనం చెందారు.వెంకటేష్ స్పెషల్ రోల్ చేసిన ఓరి దేవుడాకు మంచి టాక్ నడుస్తోంది. మాములుగా వెంకీ ఉన్నాడంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోతారు. ఎఫ్3కి ఈ అంశమే పని చేసింది. కానీ ఇప్పుడలా లేదు. వీకెండ్ పికప్ మీద యూనిట్ తో పాటు ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు. బాలయ్య సైతం అఖండ బ్లాక్ బస్టర్ కు ముందు బ్యాడ్ ఫేజ్ ని చూసినవారే. వీళ్ళందరూ టాప్ లీగ్ కాబట్టి తట్టుకుని కొనసాగుతున్నారు కానీ సుమన్, రాజశేఖర్, శ్రీకాంత్, జగపతిబాబుల కొత్త ఇన్నింగ్స్ ఎలాంటి పాత్రలతో జరుగుతున్నాయో చూస్తున్నాం. మొత్తానికి కొత్త జనరేషన్ ని మెప్పించడంలో టాప్ మోస్ట్ సీనియర్ స్టార్లు అగ్ని పరీక్షనే ఎదురుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: