RRR: జపాన్లో మొదటి రోజు వసూళ్లు ఎంతంటే?

Purushottham Vinay
ఇండియాస్ బిగ్గెస్ట్ మల్టిస్టారర్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన 'ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)' ఇండియాలో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. 'జక్కన్న 'స్ట్రాటజీకి ఫిదా అయిన ఆడియన్స్ సినిమాని ఆదరించి దెబ్బకు కాసులవర్షం కురిపించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 1100 కోట్ల పైగా వసూళ్లు సాధించి వావ్ అనిపించింది.'ఆర్ఆర్ఆర్' మూవీ టీం ప్రేక్షకులతో కలిసి నిన్న ప్రీమియర్ షోను చూడటం జరిగింది.'ఆర్ఆర్ఆర్' టీం చేసిన ప్రమోషన్స్ వర్కౌట్ కావడంతో జపాన్లోనే మంచి రెస్పాన్స్ లభిస్తోంది. తొలిరోజు ఈ సినిమాకు 8వేలకు పైగా ఫుట్ ఫాల్స్ ఉన్నాయి. గతంలో ప్రభాస్ 'సాహో'కు 6వేల 509 బాహుబలి-2కు 1382 అమీర్ ఖాన్ దంగల్ మూవీకి 1265 ఫుట్ ఫాల్స్ ఉన్నాయి. ఈ లెక్కన 'ఆర్ఆర్ఆర్' చాలా ముందంజలో ఉందని అర్థమవుతోంది.జపనీస్  మనలాగా ఊరమాస్ కాకపోయిన కంటెంట్ నచ్చితే మాత్రం వందల కోట్ల రూపాయాలను అలవోకగా కురిపిస్తారు. దీనినే దృష్టిలో ఉంచుకొనే జక్కన్న 'ఆర్ఆర్ఆర్' టీంతో ముందుగానే జపాన్లో దిగిపోయారు. అక్కడి వారితో కలిసిపోయి సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు.


ఆయన స్ట్రాటజీతోనే జపాన్లో 'ఆర్ఆర్ఆర్' మూవీకి తొలిరోజు ఏకంగా రూ. 25 కోట్ల కలెక్షన్లు వచ్చాయని టాక్ విన్పిస్తోంది.ఇండియాలో విడుదలైన ఏడునెలల తర్వాత 'ఆర్ఆర్ఆర్' మూవీ జపాన్లో విడుదల అయ్యింది. అయినప్పటికీ 'ఆర్ఆర్ఆర్' సినిమా హవా అసలు ఎక్కడ తగ్గకపోవడం విశేషం. జపాన్లో కోవిడ్ నిబంధనల కారణంగా ప్రేక్షకులు సైలెంట్ గా సినిమాను చూస్తున్నారని .. లేకుంటే 'ఆర్ఆర్ఆర్' హైప్ మరింత పిక్స్ లో ఉండేదని  కామెంట్స్ చేస్తున్నారు.గత కొద్దిరోజులుగా 'ఆర్ఆర్ఆర్' మూవీ టీం జపాన్లోనే తిష్టవేసింది. ఓవైపు సినిమా ప్రమోషన్స్ చేస్తూనే వారంతా హలీడే ట్రిప్పును కూడా ఎంజాయ్ చేస్తున్నారు.రాంచరణ్, ఉపాసన దంపతులు ఒక ఇండియన్ స్కూల్ వెళ్లడం.. తారక్ జపాన్ భాషలో మాట్లాడటం.. దోస్తీ పాటకు 'ఆర్ఆర్ఆర్' టీం రోడ్డును క్రాస్ చేయడం వంటి వీడియో ఇప్పటికే నెట్టింట్లో వైరల్ గా మారాయి. ఇవన్నీ కూడా జపనీయులను ఎంతగానో ఆకట్టుకున్నాయి

మరింత సమాచారం తెలుసుకోండి:

RRR

సంబంధిత వార్తలు: