టాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్లు ..!

murali krishna
టాలీవుడ్‌లో ఫేమస్ యాంకర్లు ఎంతమంది ఉంటారని అడిగేతే.. ఠక్కున గుర్తొచ్చే పేర్లు సుమ, అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి వేళ్లపై చెప్పేస్తారు. తెలుగులో అంతలా క్రేజ్ సంపాందించారు వీరు.టాలీవుడ్‌లో ఏ ఈవెంట్‌ జరిగినా యాంకర్ల పాత్ర చాలా కీలకం. వారు లేకుండా ఏ ఫంక్షన్ ఊహించుకోవడం కష్టమే. మరీ అంత ప్రాముఖ్యత ఉన్న యాంకర్స్ తీసుకునే రెమ్యునరేషన్‌ గురించి తెలుసుకోవాలని చాలామందికి ఉంటుంది. మరీ వారు ఒ‍క్క ఈవెంట్‌కు తీసుకుంటారు. వారిలో ఎవరికీ ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అన్న విషయాలపై ఓ లుక్కేద్దాం.
సుమ కనకాల: ప్రస్తుతం తెలుగులో టాప్ యాంకర్‌ సుమ కనకాల. ఆంధ్రావాలా ఆడియో ఫంక్షన్ నుంచి ఇప్పటి వరకు ఆమె దిగ్విజయంగా కొనసాగిస్తోంది. సుమ కనకాల హాజరయ్యే ఒక్క ఈవెంట్‌కు దాదాపు రూ.2.5 లక్షల రెమ్యునరేషన్ తీసుకుంటోంది.
ప్రదీప్ మాచిరాజు:మేల్ యాంకర్స్‌లో ముందు వరుసలో వినిపించే పేరు ప్రదీప్ మాచిరాజు. టాలీవుడ్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న ప్రదీప్ వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. ప్రదీప్ ఒక్క ఈవెంట్‌కు లక్ష రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.
అనసూయ భరద్వాజ్: జబర్దస్త్ ద్వారా ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్న యాంకర్. కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన అనసూయ భరద్వాజ్ కూడా భారీగానే పారితోషికం తీసుకుంటోంది. దాదాపు రూ.2 లక్షల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్న అనసూయ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తోంది.
రష్మీ గౌతమ్: జబర్దస్ కామెడీ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించిన మరో యాంకర్ రష్మీ గౌతమ్. ఆమె అప్పుడప్పుడు కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. యాంకర్‌గా మంచి పేరు తెచ్చుకున్న రష్మీ ప్రస్తుతం రూ.1.50 వేల నుంచి నుండి రూ1.70 వేల వరకు పారితోషికం అందుకుంటోంది.
రవి: ప్రదీప్ తర్వాత అంతలా పేరు సంపాదించిన మరో మేల్ యాంకర్ రవి. పటాస్‌ షోతో క్రేజ్ సంపాదించిన రవి కెరీర్‌లో దూసుకెళ్తున్నారు. ఒక్కో ఈవెంట్‌కు రూ.లక్ష రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటూ.. మరోవైపు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు.
శ్యామల: టాలీవుడ్‌లో ఫేమస్‌ అయిన మరో యాంకర్ శ్యామల. ఆమె కూడా ప్రస్తుతం రూ.50 వేల వరకు పారితోషికం తీసుకుంటూ.. సినిమాల్లోనూ నటిస్తోంది.మంజూష: టాలీవుడ్‌ మరో యాంకర్ మంజూష. ఆమె కూడా రూ.50వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. ఇంటర్వ్యూల్లో ఎక్కువగా కనిపించే మంజూష యాంకర్‌గా తెలుగులో ఫేమస్ అయింది.
వర్షిని: టాలీవుడ్‌ మరో యాంకర్ వర్షిని. ప్రస్తుతం ఆమె రూ.30 వేల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటోంది. వర్షినికి జబర్దస్త్ ద్వారా తెలుగులో గుర్తింపు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: