కాంతార : అక్కడ కూడా ఆగని దండయాత్ర..?

Purushottham Vinay
కాంతార : అక్కడ కూడా ఆగని దండయాత్ర..?

ప్రస్తుతం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న కన్నడ సినిమా 'కాంతార' గురించి దేశం అంతటా కూడా చర్చ సాగుతోంది. విడుదల అయిన అన్ని చోట్లా కూడా ఈ సినిమా భారీ లాభాలను తెచ్చిపెట్టి నిర్మాతలకు లాభాలు ఇస్తుంది.మొదటి కన్నడ నాట విడుదల అయిన ఈ సినిమా తరువాత అన్ని ఏరియాల్లో కూడా అదరగోడుతుంది.ఈ సినిమాను కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి నటించి, తెరకెక్కించిన తీరు అద్భుతంగా ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు.ఈ సినిమాలో రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్‌కు అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని కామన్ ఆడియెన్స్ నుండి సెలబ్రిటీల వరకు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.ఈ సినిమాకు కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ ప్రేక్షకులు సూపర్ రెస్పాన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా యూఎస్‌లో కాంతార చిత్రాన్ని చూసేందుకు అక్కడి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. 


ఇప్పటికే ఈ సినిమా యూఎస్ బాక్సాఫీస్ వద్ద 950K డాలర్ల వసూళ్లు రాబట్టగా, శనివారం నాటికి ఈ సినిమా ఖచ్చితంగా 1 మిలియన్ డాలర్ క్లబ్‌లో జాయిన్ అవుతుందని సినీ విశ్లేషకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అక్కడ కాంతార చిత్రానికి వస్తున్న సూపర్ రెస్పాన్స్‌తో డిస్ట్రిబ్యూటర్లు థియేటర్ల సంఖ్యను పెంచేందుకు నిర్ణయించుకున్నారు.ఇలా కాంతార చిత్రం కేవలం ఇండియన్ బాక్సాఫీస్ వద్ద మాత్రమే కాకుండా ఓవర్సీస్‌లోనూ సత్తా చాటుతుండటంతో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఇక ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, హొంబాలే ఫిలింస్ బ్యానర్ ప్రొడ్యూస్ చేసింది. ఈ సినిమాకు అజనీష్ లోకనాథ్ సంగీతాన్ని అందించాడు. ఇప్పటికి ఒక్కో రికార్డుని బద్దలు కొట్టుకుంటూ పోతున్న ఈ సినిమా ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చెయ్యడం ఖాయం.మరి మున్ముందు కాంతార చిత్రం ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందా అని అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: