ఒకే రోజులోనే ప్రేమ..పెళ్లి రెండు చేసుకున్న నటి..!!

murali krishna
తెలుగు సినీ ఇండస్ట్రీ లోకి మొదట చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ,హీరోయిన్ గా అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పలు పాత్రలో నటించిన నటి తులసి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఇప్పటివరకు 300కు పైగా సినిమాలలో నటిచ్చిన ఈమె చైల్డ్ ఆర్టిస్టుగా దాదాపుగా ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలలో నటించింది. ముఖ్యంగా స్టార్ దర్శకులతో కూడా పనిచేయడం చాలా గొప్పగా ఉందని ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటుంది తులసి. ముఖ్యంగా కే విశ్వనాథ్ గారి సినిమాలలో ఆమె నటనకు మంచి గుర్తింపు వచ్చిందని అది కూడా శంకరాభరణం వంటి చిత్రంలో రావడం తనకు అదృష్టమని తెలియజేస్తోంది తులసి. ఇక ఈ మధ్యనే విడుదలైన కార్తికేయ-2 చిత్రంలో కూడా తన నటనతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది తులసి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
 
తులసి గారి సినిమా జీవితం కాకుండా తమ పర్సనల్ లైఫ్ లోకి వెళితే.. ఈమె సాయిబాబా భక్తురాలట. ఈమె తన తాతగారి పెంపకంలో పెరగడం వల్ల ఎక్కువగా తన తాతయ్య వ్యక్తిత్వం తన కెరియర్ పైన చాలా ప్రభావం పడిందని తెలియజేస్తూ ఉంది. అలా చిన్న వయసును నుండే బాబా భక్తుడినే వివాహం చేసుకుంటాను అంటూ తెలియజేస్తూ ఉండేదట తులసి. దీంతో తులసి తాతగారు కూడా నువ్వు ఒక్క రోజులోనే వివాహం చేసుకుంటావని చెప్పేవారట. అలాగే తాను ఒక కన్నడ సినిమాలో నటించడానికి వెళ్తే అక్కడ డైరెక్టర్ శివమణితో తనకి పరిచయం ఏర్పడిందట. దేవరాజు గారు హీరోగా ,నిరోషా హీరోయిన్ గా ఆ సినిమాలో నటిస్తున్నారని తెలియజేసింది.
ఆ సినిమాలో ఒక పాత్ర కోసం తనని తీసుకున్నారని అయితే శివమణి తో పరిచయం ఏర్పడ్డాక ఆయనకు సాయిబాబా ఫోటో కూడా ఇచ్చానని ఇక అలా ఇచ్చిన సాయంత్రానికి ఒకరంటే ఒకరికి నచ్చి వివాహం చేసుకున్నామని తెలియజేసింది. ఇక ఆ వివాహం కూడా తన తాతగారు కట్టించిన గుడిలోని జరిగిందని తెలియజేసింది తులసి. శివమణి గారు మలయాళం అయినప్పటికీ కూడా ఆయన కుటుంబం సభ్యులు తమ పెళ్లిని ఒప్పుకోవడానికి మూడు రోజులు సమయం పట్టిందని తెలియజేసింది. ఇక తులసి తమ ఇంటికి ఫోన్ చేసి చెప్పగా బాబా నిన్ను చల్లగా చూసుకుంటారు అని చెప్పారట. అందుచేతనే వీరి కొడుకు పేరు బాబు సాయి తరుణ్ పెట్టుకున్నట్లు తెలియజేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: