ఈ వారం 'డిజాస్టర్' కంటెస్టెంట్ గా నిలిచిన వాసంతి...!!

murali krishna
బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభం లో కాస్త స్లో గా ఉన్నప్పటికీ రోజులు గడిచే కొద్దీ ఆసక్తికరమైన టాస్కులతో ప్రేక్షకుల ద్రుష్టి ని ఆకర్షించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తుంది బిగ్ బాస్ టీం..ఈ వారం ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్ ఇంటి సభ్యుల నిర్లక్ష్య ధోరణితో ఆడడం వల్ల బిగ్ బాస్ రద్దు చేసాడు..ఆ తర్వాత ఇంటి ఫుడ్ ని మొత్తం దొంగలింప చేసి హౌస్ మేట్స్ అందరికి ఆకలితో అలమటించేలా చేసాడు.ఆ తర్వాత తిండి కోసం కబడ్డీ, టగ్ ఆఫ్ వార్ వంటి గేమ్స్ పెట్టి హౌస్ లో కాస్త హీట్ ని రగిలించాడు..ప్రేక్షకులు నుండి కూడా ఈ టాస్కులకు మంచి రెస్పాన్స్ వచ్చింది..ఇక సర్వైవల్ టాస్కు లో అయితే ఇంటి సభ్యులందరు చెలరేగిపోయి ఆడారు..అయితే ఓడిపోయిన టీం నుండి ఒకరు నేరుగా తదుపరి వారానికి నామినేషన్స్ లోకి వెళ్లాలనే షరతు పెడుతాడు బిగ్ బాస్..ముందుగా శ్రీ సత్య సెల్ఫ్ నామినేట్ అవ్వాలనుకుంటుంది..కాసేపటి తర్వాత ఆమె తన నిర్ణయం ని వెనక్కి తీసుకుంటుంది.
అప్పుడు టీం లో అందరూ వోటింగ్ పద్దతి ద్వారా ఇంటి వాసంతి ని నేరుగా నామినేట్ చేస్తారు..ఈ నామినేషన్ ప్రక్రియ కాస్త వాడవేడిగానే సాగింది..ఇక ప్రతి వారంలో లాగానే ఈ వారం లో కూడా వరస్ట్ కంటెస్టెంట్ ఎవరు అనే దానిపై నామినేషన్స్ జరిగింది..అయితే ఈసారి వరస్ట్ బదులు 'డిజాస్టర్' అనే పదం ని ప్రవేశ పెట్టాడు బిగ్ బాస్..ఈ డిజాస్టర్ నామినేషన్స్ అందరూ ఎక్కువ శాతం మంది వాసంతి కి ఓట్లు వేస్తారు..దానితో ఆమె జైలు కి వెళ్తుంది..ఇలా వచ్చే వారం నామినేషన్స్ లో నేరుగా వెళ్లాననే బాధలో ఉన్న వాసంతి కి వెంటనే ఈ వారం డిజాస్టర్ కంటెస్టెంట్ అనే పేరు రావడం తో ఆమె చాలా బాదపడిపోయింది.ఇక ఈ వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయినా ఇంటి సభ్యులలో రేపు ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారనే విషయం మన అందరికి తెలిసిందే..అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మెరీనా - రోహిత్ డేంజర్ జోన్ లో ఉన్నారని..వీళ్లిద్దరి లో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవుతారని తెలుస్తుంది..ఇందులో ఎంత మాత్రం నిజం ఉందొ చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: