జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ మాములుగా లేదుగా..!!

murali krishna
ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రయూనిట్ జపాన్‏లో సందడి చేస్తు్న్న విషయం తెలిసిందే. ఇండియన్ బాక్సాఫీస్‏ను షేక్ చేసిన ఈ ప్రస్తుతం విదేశాల్లో విడుదలవుతుంది.


ఇప్పటికే అమెరికాలో భారీ రెస్పాన్స్ వచ్చింది. అలాగే.. తారక్.. చరణ్‏లు ఇద్దరూ పాన్ వరల్డ్ స్టార్స్‏గా మారిపోతున్నారు. అక్టోబర్ 21న జపాన్‏లో విడుదలైన ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఊహించని స్థాయిలో రెస్పాన్స్ కూడా వస్తోంది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తారక్, చరణ్, రాజమౌళి విడివిడిగా అభిమానులను కలుస్తున్నారు. ఈ ఇద్దరు హీరోలను కలిసేందుకు జపనీస్ అభిమానులు వీరు స్టే చేస్తున్న హోటల్స్ ముందు క్యూ కడుతున్నారట  . అలాగే.. తమకు వీరిపై ఉన్న ప్రేమను పలు రకాలుగా చూపిస్తున్నారట.


జపాన్‏లో తారక్ కు ప్రత్యేకమైన క్రేజ్ అయితే ఉంది. ఆయన నటించిన పలు చిత్రాలు అక్కడ విడుదలై సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఎన్టీఆర్ కు జపనీస్ అభిమానులు ఎక్కువగానే ఉన్నారట.. ఇక ఇప్పుడు యంగ్ టైగర్ ట్రిపుల్ ఆర్ కోసం జపాన్‏లో సందడి చేస్తుండగా.. తారక్ ను కలిసేందుకు భారీగానే లేడీ ఫ్యాన్స్ చేరుకున్నారట.. వారితో ఫోటస్ దిగడమే కాకుండా.. ఆటోగ్రాఫ్స్ ఇస్తూ సంతోషపరిచాడు. అయితే ఇక్కడ తారక్ ను చూడగానే ఓ అమ్మాయి ఎమోషనల్ అయ్యింది. తను చూసింది ఎన్టీఆర్ నేనా అనే సందేహంతో కన్నీళ్లు పెట్టుకుందట.. ఇందుకు సంబంధించిన వీడియోస్ మరియు ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి.


అత్యంత ప్రతిష్టాత్మకంగా జక్కన్న తెరకెక్కించిన ఈ మూవీలో చరణ్.. అల్లూరి సీతారామరాజు పాత్రలో.. తారక్.. కొమురం భీమ్ పాత్రలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించగా.. డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారట.. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్.. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఈ మూవీ తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో పనిచేయనున్నారని సమాచారం.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: