కాంతారపై బాలీవుడ్ కాంట్రవర్శి నటి షాకింగ్ కామెంట్స్?

Purushottham Vinay
కన్నడ కళాఖండం 'కాంతార' చిత్రం ప్రస్తుతం యావత్ దేశాన్ని బాగా ఊపేస్తుంది. సినిమాలో కంటెంట్ కరెక్ట్‌గా ఉంటే, ఎలాంటి భాషలో అయినా ఆడియెన్స్‌కు కనెక్ట్ అవుతుందని మరోసారి ఈ చిత్రం ప్రూవ్ చేసింది.రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో హీరోగా తెరకెక్కించిన ఈ సినిమా ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ కావడంతో భాషతో సంబంధం లేకుండా అన్ని ఇండస్ట్రీల్లో కూడా ఈ సినిమాకు ప్రేక్షకులు పట్టం కడుతున్నారు.కామన్ ఆడియెన్స్ మొదలుకొని సెలబ్రిటీలు వరకు ఈ సినిమాను ఆకాశానికెత్తుతున్నారు. తాజాగా కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపించింది బాలీవుడ్ స్టార్ బ్యూటీ కంగనా రనౌత్. తన కుటుంబ సభ్యులతో కలిసి ఈ సినిమా చూశానని.. ఈ సినిమా ఇంకా తన మదిలోనే మెదులుతుందని.. ఇది ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని ఆమె కొనియాడింది. సాంప్రదాయం, జానపద కథలు, దేశీయ సమస్యల సమ్మేళనమే ఈ సినిమా అని కంగనా పేర్కొంది. 


ఇక ఈ సినిమాలో రిషబ్ శెట్టి రచన, యాక్టింగ్, డైరెక్షన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉన్నాయని ఆమె తెలిపింది. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయని కంగనా చెప్పుకొచ్చింది.ఇక ఈ సినిమాను అక్టోబర్ 15న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయగా, రోజురోజుకూ ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఈ సినిమాలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, హొంబాలే ఫిలింస్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా ప్రొడ్యూస్ చేసింది. మరి ఈ సినిమా మున్ముందు ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.ఇప్పటి దాకా ఈ సినిమా మొత్తం 130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్టు సమాచారం తెలుస్తుంది. ఇక లాంగ్ రన్ లో ఈ సినిమా ఇంకెన్ని రికార్డులు కొల్లగొడుతుందో చూడాలి. తెలుగులో కూడా మంచి లాభాలతో దూసుకుపోతుంది.కంగనా ప్రస్తుతం సౌత్ ఇండియన్ మూవీస్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంది. బాలీవుడ్ అవకాశాలు తగ్గడంతో ఇలా సౌత్ మూవీలపై బిస్కెట్లు వేస్తుందని నెటిజన్స్ ఆమెను ట్రోల్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: