రేణు దేశాయ్ పోస్ట్ కు కారణం అదేనా...?

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఎలాంటిదో మనకు తెలిసిందే.మెగా స్టార్ చిరంజీవి తమ్ముడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గానే పాల్గొంటున్నారు.


ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ తాజాగా మీడియా సమావేశంలో భాగంగా వైఎస్ఆర్సిపి నాయకుల పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ తాను మూడు పెళ్లిళ్లు చేసుకుంటే మీకేంటి మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నప్పటికీ తన భార్యలకు విడాకులు ఇచ్చే సమయంలో భారీగా భరణం చెల్లించాలని ఈయన తెలిపారట..మొదటి భార్యకు ఐదు కోట్లభరణం ఇవ్వగా రెండవ భార్య రేణు దేశాయ్ కు తన ఆస్తిలో కొంత భాగం రాసిచ్చానంటూ ఈయన బహిరంగంగా తెలియజేశారట..అయితే గతంలో ఎన్నో ఇంటర్వ్యూలలో పాల్గొన్న రేణు దేశాయ్ తాను పవన్ కళ్యాణ్ నుంచి రూపాయి కూడా భరణంగా తీసుకోలేదని తెలియజేశారు. ఈ క్రమంలోనే మరోసారి ఈ విషయం పలు చర్చలకు కూడా దారితీస్తుంది.


ఇదిలా ఉండగా సోషల్ మీడియా వేదికగా రేణు దేశాయ్ చేసినటువంటి ఒక పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.అయితే ఈ పోస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ ఆస్తి రాసిచ్చాను అంటూ చేసిన వ్యాఖ్యలను ఉద్దేశించి చేశారని మరికొందరు కూడా భావిస్తున్నారు.ఈ క్రమంలోనే రేణు దేశాయ్ సోషల్ మీడియా వేదికగా నీ వర్షన్ లో కాదు నా వర్షన్ లో కాదు నిజం అనేది ఒకటి ఉంటుంది ఆ నిజం మాత్రమే శాశ్వతం.. అనేది జీవితంలో నేను నేర్చుకున్నటువంటి అంశం అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుందట.అయితే ఈ పోస్ట్ మాత్రం పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి చేశారంటూ కొందరు ఈ పోస్ట్ పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: