టీజర్: ధమాక చిత్రంతోనైనా రవితేజ సక్సెస్ అందుకుంటారా..!!

Divya
రవితేజ వరుస ప్లాపుల తర్వాత క్రాక్ చిత్రం తో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే అలా వచ్చిన సక్సెస్ ను మాత్రం ఎక్కువ రోజులు నిలబెట్టుకోలేకపోయారు. ఆ తర్వాత నటించిన ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ సినిమాలు భారీ డిజాస్టర్ ని చవి చూశాయి. ఇక దీంతో తాజాగా నటించిన ధమాకా చిత్రంతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ లోను చిత్ర బృందం చాలా స్పీడ్ గా చేస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా పండగ కంటే ముందుగా ఈ సినిమా టీజర్ ని ఈ రోజున విడుదల చేయడం జరిగింది.

ఇక ధమాకా చిత్రంలో రవితేజ సరసన హీరోయిన్ శ్రీ లీలా నటిస్తున్నది. ఇక ఈ సినిమా విడుదల చేస్తూ మేకర్స్ కాస్త ముందుగానే రవితేజ అభిమానులకు దీపావళి సంబరాలు మొదలయ్యాయని తెలియజేశారు. ధమాకా చిత్రంలో రవితేజ మరొకసారి మాస్ గెటప్ లో కనిపించబోతున్నారు అంతేకాకుండా ఇందులో డ్యూయల్ రోల్ పాత్రలో కనిపించనున్నారు. ఇక రవితేజ చెప్పిన డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. మొత్తానికి ధమాకా టీజర్ లో మాస్ యాంగిల్ గా మరొకసారి అదరగొట్టేసారని రవితేజ చెప్పవచ్చు.
ఇక టీజర్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాటు విజువల్ ప్రజెంటేషన్ కూడా ఈ సినిమాకి హైలైట్ గా ఉండేలా కనిపిస్తున్నాయి. ఇక హీరోయిన్ శ్రీ లీలా ప్రత్యేకమైన ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఈ చిత్రానికి దర్శకుడుగా త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి ఈ టీజర్ మాత్రం చాలా వైరల్ గా మారుతోంది. మరి ఈ చిత్రంతో నైనా రవితేజ తన కెరీర్ ను మరొకసారి మలుపు తిప్పుకుంటారేమో అని అభిమానులు చాలా ఆత్రుతగా ఉన్నారు. ఇక ఈ చిత్రం డిసెంబర్ 23వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు  తెలియజేయడం జరిగింది. సక్సెస్ అందుకుంటారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: