టీజర్:మరొక కన్నడ కేడి సినిమా టైటిల్ టీజర్ అదుర్స్..!!

Divya
ఇటీవల కాలంలో కన్నడ సినీ పరిశ్రమ నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు విడుదలవుతూ ఉన్నాయి. అవన్నీ పాన్ ఇండియా స్థాయిలో మంచి విజయాన్ని అందుకుంటున్నాయి. ముఖ్యంగా కేజిఎఫ్, కే జి ఎఫ్-2 , చార్లీ-777, విక్రాంత్ రోణ, తాజాగా కాంతారా వంటి సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి ఇక ఈ చిత్రాలన్నీ కలెక్షన్ల పరంగా కూడా భారీ స్థాయిలో రాబట్టడం జరిగింది. ఇక ఇప్పుడు తాజాగా మరొక సినిమా ఇప్పుడు మంచి హైప్ ని తీసుకురాబోతోంది. ఆ చిత్రమే కేడి. ఈ సినిమా టైటిల్ ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది.

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధ్రువ సర్జ హీరోగా నటిస్తున్న తాజా  చిత్రం కేడి. ఈ సినిమా శాండిల్ వుడ్ స్టార్ డైరెక్టర్ ఫ్రేమ్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని ఇండియా స్థాయిలో విడుదల చేయబోతున్నారు. కన్నడలో పాటు తెలుగు తమిళ్ మలయాళం హిందీ వంటి భాషలలో కూడా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు ఈ సినిమాకి పవర్ ఫుల్ టైటిల్ను ఖరారు చేసి మేకర్స్ గ్రాండ్గా నిర్వహించిన ఈవెంట్లో ఈ టైటిల్ టీజర్ ని కూడా విడుదల చేయడం జరిగింది.

బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఈ సినిమా టీజర్ లాంచ్ చేయడం జరిగింది. ఇక ఈ సినిమా టీజర్ విషయానికి వస్తే.. రామాయణం యుద్ధం స్త్రీ కోసం జరగగా మహాభారత యుద్ధం రాజ్యం కోసం.. ఈ కలియుగ యుద్ధం కేవలం రక్తం కోసమే అంటూ ఈ సినిమా టీజర్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ సినిమా టీజర్ మొదటి నుంచి వీడియో మైండ్ బ్లోయింగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ టీజర్ లో కాళీ అనే వ్యక్తి జైలు నుంచి బయటికి విడుదల కావడం జరుగుతుంది. దీంతో అక్కడికి పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు. అలా ఒక చేతిలో పెద్ద కత్తి పట్టుకుని భుజాన శవాన్ని వేసుకొని యాక్షన్ ధృవ సర్జని ఊర మాసవతారంలో చూపించారు డైరెక్టర్. ఇక ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంటున్న అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ సినిమా టీజర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: