కాంతార మట్టి నుండి పుట్టిన కథ: అల్లు అరవింద్

Purushottham Vinay
కాంతార మట్టి నుండి పుట్టిన కథ: అల్లు అరవింద్
కన్నడ డైరెక్టర్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తూ, డైరెక్ట్ చేసిన కన్నడ చిత్రం 'కాంతార'. 'కేజీఎఫ్‌' తీసిన హోంబలే సంస్థ ఈ సినిమాని నిర్మించింది. ఈ అద్భుతమైన సినిమాని తెలుగులో అల్లు అరవింద్ రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమా అన్ని ఏరియాల్లో  సూపర్ హిట్ టాక్‌ తెచ్చుకోవడంతో నిన్న సక్సెస్‌ మీట్ నిర్వహించారు. రిషబ్ మాట్లాడుతూ 'అద్భుతమైన విజయాన్నిచ్చిన తెలుగు ప్రేక్షకులకు థ్యాంక్స్. కన్నడలో తీసిన ఈ సినిమా దానంతట అదే ప్యాన్‌ ఇండియా మూవీగా మారిపోయింది. సౌత్, నార్త్ అనే బౌండరీస్‌ చెరిగిపోయి ఇండియన్‌ సినిమాగా దీన్ని కీర్తించడం సంతోషంగా ఉంది.మన సంస్కృతి, సంప్రదాయాల మూలాల్లో నుండి వచ్చిన సినిమా ఇది. చిన్నప్పటి నుండి నేను చూసిన నా ఊరి కథ. తెలుగులో ఫస్ట్ డే కలెక్షన్స్‌తోనే బ్లాక్‌ బస్టర్ టాక్ రావడం, ఐదు రోజుల్లో ఇరవై కోట్ల వరకు వసూళ్లు రాబట్టడం ఆశ్చర్యపరుస్తోంది. 


కంటెంట్ నచ్చితే తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఆదరిస్తారనడానికి ఇది నిదర్శనం. ఈ ప్రోత్సాహంతో మున్ముందు మన కల్చర్, రూట్స్‌, జానపదాల్లోని కథలను సినిమాలుగా మలిచే ప్రయత్నం చేస్తాను' అన్నాడు. అల్లు అరవింద్ మాట్లాడుతూ 'సినిమాకి భాషా భేదాలుండవు. ఎమోషన్‌ బ్యారియర్‌ మాత్రమే ఉంటుంది. ఆ ఎమోషన్‌కే ప్రేక్షకులు కనెక్టవుతారు. ఇది ఏ ఇంగ్లిష్, యూరోపియన్, కొరియన్‌ సినిమానో చూసి పుట్టిన కథ కాదు. మట్టి నుండి పుట్టిన కథ. రిషబ్ తన ఊరి విశేషాలను, తన ఎమోషన్‌ను కథలోకి తీసుకురావడం వల్లే ఇంతలా కనెక్టయింది. గీతా ఆర్ట్స్‌లో ఓ సినిమా చేయమని తనని అడిగాను. ఒప్పుకోవడం సంతోషం' అన్నారు. సప్తమీ గౌడ, కైకాల రామారావు, లిరిసిస్ట్ రాంబాబు గోసాల ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు.కాంతార ఇప్పుడు కర్ణాటకలో సంచలనాలు సృష్టిస్తుంది. ఎక్కడ చూసిన కూడా కాంతార పేరు మారు మొగిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: