సుధీఫ్ తో మీనా పెళ్లి అయ్యిందా..అసలు నిజం ఇదే..!!

Satvika
సినీ ఇండస్ట్రీలో అందరితో క్లోజ్ గా ఉండాలి.. కలిసిపొవాలి.. అప్పుడే కొన్ని ఆఫర్స్ కూడా మనకు వస్తాయి.ఈ క్రమంలోనే ఎన్నో రుమెర్స్ కూడా రావడం సహజం..అవన్నీ పట్టించుకోవడం మానేసి మన పని మనం చేసుకొవాలి.. అలా వున్న కూడా కొన్ని కథనాలు వస్తుంటాయి..హీరోయిన్ మీనాకు కూడా అలాంటి అనుభవం ఎదిరైంది..సౌత్ ఇండియాలో అందరి స్టార్ హీరోస్ ఆడి పాడిన హీరోయిన్. అన్ని భాషల్లోనూ స్టార్ హీరోలతో ఆమె జోడి కట్టి ఏకంగా ఒక దశాబ్ద కాలం పాటు నంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగింది.రజినీ కాంత్, కమల్ హాసన్, వెంకటేష్, నాగార్జున, మోహన్ లాల్, మమ్ముట్టి వంటి అనేక మంది హీరోల సరసన మీనా నటించి వీరందరికి మంచి జోడి అనిపించుకుంది.

శివాజీ గణేశన్ సినిమాలో 1982 లో తొలిసారి గా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఆ తర్వాత ఎనిమిదేళ్ళకు రాజేంద్ర ప్రసాద్ హీరోగా నవయుగం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది.నాలుగు దశాబ్దాలుగా నటిగా తన ప్రయాణం కొనసాగిస్తున్న మీనా తన కూతురు నైనికాను కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా పరిచయం చేసింది. ఇక మీనా తల్లి రాజా మల్లిక కూడా నటి కావడం విశేషం. 1990 లలో హీరోయిన్ గా ఎంటర్ అయ్యి 2009 వరకు ఆమె సినిమాలతో కాకుండా ఎన్నో కాంట్రవర్సీ లను ఎదుర్కొంది. మీనా పెళ్లి విషయంలో చాలా మంది హీరోలతో ఆమె పేరును జోడించి వార్తలు వచ్చేవి. అందులో నిజా నిజాలు పక్కన పెడితే ఒకానొక సమయంలో కన్నడ హీరో కిచ్చా సుదీప్ తో రహస్యంగా వివాహం చేసుకుంది అని వార్తలు రావడం తో ఒక్కసారి సౌత్ ఇండియాలో ని అన్ని పరిశ్రమలు ఉలిక్కి పడ్డాయి.

సుదీప్ - మీనా రెండు సినిమాల్లో నటించగా ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. 2003 లో స్వాతి ముత్తు అనే సినిమాలో మొదటి సారి కలిసి నటించగా, 2006 లో మై ఆటోగ్రాఫ్ సినిమాలో కూడా నటించారు. ఈ సినిమాల్లో నటిస్తున్న సమయంలోనే షూటింగ్ లొకేషన్ లోనే ప్రేమలో పడి, రహస్యంగా పెళ్లి చేసుకున్నారనేది సదరు వార్తల సారాంశం. ఈ వార్తల జోరు పెరుగుతున్న క్రమంలో సుదీప్ - మీనా ఇద్దరు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు.మీడియా ఎప్పుడు నా పెళ్లి విషయంలో బాగా అత్యుత్సాహం ప్రదర్శిస్తుంది. ఇది మూడో సారి నాకు మీడియా పెళ్లి చేయడం. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు. నేను - సుదీప్ మంచి స్నేహితులం మాత్రమే. మేము ఇద్దరం కలిసి కేవలం రెండు సినిమాల్లో మాత్రమే కలిసి నటించాం.

మీడియా నుంచి నా పెళ్లిని నేను ఎప్పుడు దాచాలనుకోవడం లేదు. అందరికి ఆహ్వానం పంపి నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను.. అని వివరించారు.ఇక ఇలాంటి గాసిప్స్ వచ్చిన కొన్నాళ్లకే మీనా ఇంట్లో పెద్దలు చుసిన పెళ్ళికి ఒప్పుకొని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ విద్యా సాగర్ ని పెళ్లి చేసుకుంది. కానీ దురదృష్టవశాత్తు కొన్నాళ్ల క్రితం మీనా భర్త అనారోగ్య సమస్యలతో మృతిచెందిన సంగతి తెలిసిందే. ఇక హీరోయిన్ గా ఆమె కెరీర్ ముగిసిన వెంటనే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారి మళ్లి సినిమాల్లో నటిస్తున్నారు మీనా..ఇటీవల ఆమె నటించిన దృశ్యం సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: