డిజిటల్ స్ట్రీమింగ్ కి రెడీ అయిన ధనుష్ "నేనే వస్తున్నా" మూవీ..?

Pulgam Srinivas
తమిళ సినిమా ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరో లలో ఒకరు అయిన ధనుష్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తమిళ సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న ధనుష్ తాను నటించిన ఎన్నో మూవీ లను తెలుగు లో కూడా విడుదల చేసి అలాగే టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎన్నో విజయాలను అందుకొని ఈ హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కూడా మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.

ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సంవత్సరం ధనుష్ "తిరు" మూవీ తో మంచి విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. తిరు లాంటి మంచి విజయ వంతమైన మూవీ తర్వాత ధనుష్ "నానే వరువేన్" అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ ని తెలుగు లో నేనే వస్తున్నా పేరుతో విడుదల చేశారు. ఈ మూవీ ని తెలుగు లో గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ విడుదల చేశారు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన నేనే వస్తున్నా మూవీ ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయింది. దానితో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం పాలయ్యింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టు కోలేక పోయిన నేనే వస్తున్నా మూవీ "ఓ టి టి" విడుదలకు రెడీ అయినట్లు ఒక వార్త వైరల్ అవుతుంది. ఈ మూవీ "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ సంస్థ ఆయినటు వంటి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" సంస్థ దక్కించుకున్నట్లు , 23 అక్టోబర్ 2022 వ తేదీ నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో నేనే వస్తున్నా మూవీ ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ,  అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే రాబోతున్నట్లు ఒక వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: