జపాన్ కు బయల్దేరిన రామ్ చరణ్ - ఉపాసన, దర్శకధీరుడు రాజమౌళి కూడా....!!

murali krishna
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) - ఉపాసన కొణిదెల తాజాగా జపాన్ కు బయల్దేరారు. ఈ మేరకు ఎయిర్ పోర్టులో ఈ జంటతో పాటు ఎస్ఎస్ రాజమౌళి కూడా కనిపించడం విశేషం.ప్రస్తుతం చరణ్, ఉపాసనకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
 
దర్శకధీరుడు, ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడికల్ యాక్షన్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్'(RRR). ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటు బాక్సాఫీస్ వద్ద కూడా 'ఆర్ఆర్ఆర్' దుమ్ములేపింది. రూ.1200 కోట్లకు పైగా వసూళ్లు రాబ్టటి వరల్డ్ వైడ్ అత్యధిక వసూళ్లు రాబట్టిన నాల్గో ఇండియన్ సినిమాగా రికార్డు చేసింది.
 
చిత్రంలో ఉద్యమవీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటించి మెప్పించాడు. కొమురం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన నట ప్రదర్శన కనిబరిచారు. చిత్రం విడుదలై ఇప్పటికీ ఏడు నెలలు గడస్తున్నా ఇంకా క్రేజ్ తగ్గడం లేదు. ఇంకా ప్రపంచ దేశాల్లో 'ఆర్ఆర్ఆర్' సందడి చేస్తూనే ఉంది.
 
ప్రస్తుతం జపాన్ దేశంలో రిలీజ్ కు సిద్ధం అవుతోంది. అక్టోబర్ 21న అక్కడ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అయితే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జపాన్ కు బయల్దేరాడు.ఇప్పటికే భారీ క్రేజ్ ను సంపాదించుకున్న ఈ చిత్రం జపాన్ లోనూ సెన్సేషన్ క్రియేట్ చేయబోతోంది.
 
ఈ సందర్భంగా రామ్ చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కొణిదెల (Upasana Konidela) కూడా జపాన్ కు బయల్దేరింది. వీరి వెంట పెట్ రైమ్ ను కూడా తీసుకెళ్తున్నారు. ఈ సందర్భంగా రామ్ చరణ్ - ఉపాసన తాజాగా జపాన్ లో ల్యాండ్ అయ్యారు. ఎయిర్ పోర్టులో వీరికి సంబంధించిన ఫొటోలు చక్కర్లు కొడుతున్నాయి.
 
వీరితో పాటు 'ఆర్ఆర్ఆర్' ప్రమోషన్స్ ను విజయవంతం చేసేందుకు ఎస్ఎస్ రాజమౌళి కూడా జపాన్ కు వెళ్లారు. రాజమౌళి, చరణ్ కలిసి సినిమాను ఆడియెన్స్ కు మరింత రీచ్ అయ్యేలా చేయబోతున్నారు. ఈసందర్భంగా వీరిని చూసిన అభిమానులు ఒక్కసారికి గుంపులుగుంపులు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి.
 
ఈ బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రియా సరసన్, అజయ్ దేవగన్, రాహుల్ రామక్రిష్ణ ముఖ్య పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతం అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: