కెప్టెన్సీ టాస్క్ ను నిలిపివేసిన బిగ్ బాస్...!!

murali krishna
బిగ్ బాస్ సీసన్ 6 ప్రారంభం అయ్యినప్పటి నుండి నేటి వరుకు ఎంటర్టైన్మెంట్ పరంగా, టాస్కులు పరంగా..జనాలను ఎమోషనల్ గా కనెక్ట్ చెయ్యడం పరంగా గత వారం ది బెస్ట్ గా వీక్ గా అయితే చెప్పుకోవచ్చు..ఆ తర్వాత వీకెండ్ కూడా చాలా సరదాగా గడిచిపోయింది..అలా ఎంతో పాజిటివ్ వైబ్రేషన్స్ తో ప్రారంభం అయినా ఈ వారం మొదటి ఎపిసోడ్ తోనే బాగా బోర్ కొట్టించేసారు..ఈ వారం కెప్టెన్సీ టాస్కులో భాగంగా బిగ్ బాస్ ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ టాస్కు ని ఇంటి సభ్యులు సరిగా ఆడలేకపొయ్యారు..ఎంటర్టైన్మెంట్ పంచడం లో ఒకరిద్దరు మినహా మిగిలిన ఇంటి సభ్యులందరు కూడా ఫెయిల్ అయ్యారు..సూర్య తన మిమిక్రీ టాలెంట్ తో కాస్త ఎంటర్టైన్మెంట్ పంచాడు.


గీతూ, ఫైమా, రేవంత్ మరియు శ్రీహన్ వంటి వారు కూడా పర్వాలేదు అనిపించారు..రోహిత్ మరియు బాలాదిత్య కి సరిగా ఎంటర్టైన్మెంట్ టాస్క్ చెయ్యడం రాకపోయినప్పటికీ గట్టి ప్రయత్నం అయితే చేసారు..అలా ఎదో ఒక మోస్తారు సాగిపోతున్న ఈ ఎపిసోడ్ మధ్యలో అర్జున్ మరియు రేవంత్ గొడవ పడడం తో బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కుని రద్దు చేసేసాడట .


'బిగ్ బాస్ హౌస్ చరిత్ర లోనే అతి నీరసంగా టాస్కులు చేస్తుండడం, బిగ్ బాస్ తో పాటు ప్రేక్షకులను కూడా లెక్కచెయ్యకుండా ఆడే కంటెస్టెంట్స్ ని మొట్టమొదటిసారి చూస్తున్నాను..మీ నిర్లక్ష్యానికి శిక్షగా ఈ వారం కెప్టెన్సీ టాస్కుని రద్దు చేస్తున్నాను..ఈ వారం ఈ హౌస్ కి కెప్టెన్ ఉండదు..ఎవరికైనా ఆడడం ఇష్టం లేకపోతే వెంటనే వెళ్లిపోవచ్చు' అని బిగ్ బాస్ చాలా సీరియస్ గా మందలిస్తాడట..అసలు ఈ కెప్టెన్సీ టాస్కు ఆగిపోవడానికి ముఖ్య కారణం శ్రీ సత్య..సజావుగా సాగిపోతున్న టాస్కుని ఈమె గెలికేసింది..అర్జున్ తో ఆమె మాట్లాడుతూ 'ఎవరు ఎమన్నా పట్టించుకోవా అసలు..నువ్వు మనిషివేనా' అంటూ శ్రీసత్య తిడుతుందట.అప్పుడు అర్జున్ రేవంత్ తో 'ఏమన్నావు నువ్వు నన్ను' అంటూ గొడవకి పోతాడు..అలా వీళ్లిద్దరు క్యారెక్టర్స్ నుండి బయటకి వచ్చి తగువులు వేసుకోవడం తో బిగ్ బాస్ హర్ట్ అయ్యి టాస్కుని ఆపేసాడట...మళ్ళీ తిరిగి కెప్టెన్సీ టాస్కుని ప్రారంబిస్తాడా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న..అలా శ్రీ సత్య మొత్తం సర్వ నాశనం చేసేసింది..ఈ వీకెండ్ లో నాగార్జున గారి చేతిలో ఈమెకి బదిత పూజ తప్పేలా అయితే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: