అన్నా అన్న అంటూ బాలఆదిత్య ను మోసం చేసిన గీతు..!!

murali krishna
బిగ్ బాస్ సీజన్ 6 లో మిస్టర్ పర్ఫెక్ట్ ఇమేజ్ తో అందరితో మంచిగా ఉంటూ మంచోడుగా పేరు తెచ్చుకున్నాడు ఎవరు అంటే అతను బాలాదిత్య. ఈ సీజన్ లో బహుశా ఆడియన్స్ కి అందరికి బాగా సుపరిచితమైన కంటెస్టంట్ ఇతనే అని చెప్పొచ్చు.
సినిమా హీరోగా.. సీరియల్ యాక్టర్ గా బాలాదిత్య  చాలా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. బిగ్ బాస్ హౌజ్ లో మొదటి రోజు నుంచి తన సత్ ప్రవర్తనతో అందరిని తెగ ఆకట్టుకున్నాడు బాలాదిత్య. ఎక్కడ గొడవ జరిగినా అది ఆపేందుకు ప్రయత్నిస్తూ హోస్ట్ నాగార్జున చేత చీవాట్లు తిన్నాడు బాలాదిత్య.
ఆ తర్వాత గొడవలు జరిగినా పట్టించుకోకపోవడంతో మళ్లీ అదే నాగార్జున ఏమయ్యా హౌజ్ లో అంత పెద్ద గొడవ జరిగితే నీకేమి పట్టనట్టు ఉన్నావని అన్నారు మరి . తను మంచిగా ఆడాలా.. ఇప్పటినుంచి అందరిలా అందరి మీద అరుస్తూ ఫైర్ అవుతూ ఆట కొనసాగించాలా అని బాలాదిత్య ఆలోచనలో పడ్డాడు. అయితే అందరితో ఏమో కానీ అతను సిస్టర్ అనుకున్న గీతు తోనే అతనికి పెద్ద సమస్య వచ్చి పడ్డది. ఈ వారం నామినేషన్స్ లో గీతు బాలాదిత్యనే నామినేట్ చేసింది అంట . అన్న అన్న అనుకుంటూ గీతు బాలాని నామినేట్ చేయడం అందరికి షాక్ ఇచ్చింది.
 
ఇప్పటివరకు మంచిగా ఉన్న నువ్వు.. అదే మంచి ఇమేజ్ తో బయటకు వెళ్లిపో అంటూ గీతు ఇచ్చిన స్టేట్ మెంట్ బాలాదిత్యని బాగా హర్ట్ అయ్యేలా చేశాయి అంటా . బాలా అన్న ఇక ఇప్పుడు మోల్కొని అసలైన ఆట తీరు ప్రదర్శనించకపోతే ఇంత మంచి వాడు బిగ్ బాస్ కొట్లాటల్లో ఎందుకని బయటకు పంపించేస్తారు మరీ . సో బాలాదిత్య తక్షణమే తన ఆట తీరు మార్చుకుని మంచికి మంచి.. చెడుకి చెడు.. ఆటకి ఆట అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంటే  చాలా బెటర్ అని ఆడియన్స్ వాదన అడుగుతున్నారు . మొదటి రెండు మూడు వారాల్లోనే టాప్ 5 పక్కా అనుకునేలా చేసిన బాలాదిత్య సుదీపతో చివరి వరకు నామినేషన్స్ లో ఉండటం అతని గ్రాఫ్ ఇలా పడిపోయింది అని చెప్పడానికి ఉదహరణ ఇదే .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: