ప్రభాస్ పుట్టినరోజు నాడు ఆ మూవీ నుండి అదిరిపోయే అప్డేట్..?

Pulgam Srinivas
రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. మిర్చి మూవీ వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో స్టార్ హీరో లలో ఒకరిగా కొనసాగిన రెబల్ స్టార్ ప్రభాస్ "మిర్చి" మూవీ తర్వాత  దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి సిరీస్ మూవీ ల ద్వారా దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు. అలా బాహుబలి మూవీ ద్వారా దేశ వ్యాప్తంగా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లలో ,  అంతకు మించిన మూవీ లలో హీరో గా నటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా ఇప్పటికే ప్రభాస్ "బాహుబలి" మూవీ తర్వాత సాహో ,  రాధే శ్యామ్ వంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లలో హీరో గా నటించి ప్రేక్షకులను పలకరించాడు.

ఇది ఇలా ఉంటే ప్రభాస్ ఇప్పటికే ఆది పురుష్ మూవీ షూటింగ్ ను పూర్తి చేసుకుని సలార్  మరియు ప్రాజెక్ట్ కే మూవీ షూటింగ్ లలో పాల్గొంటున్నాడు. ఇలా వరుస సినిమా కమిట్మెంట్ లతో ఫుల్ బిజీగా సమయాన్ని గడుపుతూ వస్తున్న రెబల్ స్టార్ ప్రభాస్ టాలీవుడ్ టాలెంటెడ్ దర్శకుడు అయినటువంటి మారుతీ దర్శకత్వంలో ఒక మూవీ లో నటించబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మూవీ షూటింగ్ రేపటి నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఫస్ట్ లుక్ లో భాగంగా నిన్న ఈ మూవీ యూనిట్ ఫోటో షూట్ ను జరిపినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ నెల ప్రభాస్ పుట్టినరో జు అయినటువంటి అక్టోబర్ 23 వ తేదీన ప్రభాస్ , మారుతి కాంబినేషన్ లో తేరకేక్కబోయే మూవీ నుండి ఒక పోస్టర్ ను మూవీ యూనిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: