టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ వద్దనుకున్న. టాప్ 10 హిట్ సినిమాలు ఇవే..!

murali krishna
తెలుగు చిత్ర పరిశ్రమలో ఎందరో స్టార్ హీరోలు ఉన్నారు.. వారిలో ముఖ్యంగా చిరంజీవి ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను దక్కించుకున్నాడు.చిరంజీవి తర్వాత ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన హీరో రవితేజ.. రవితేజ తన కెరియర్ మొదట్లో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు.. రవితేజ తన కెరియర్ ప్రారంభంలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు సినిమాలలో నటించాడు.. అలా రవితేజ టాలీవుడ్‌లో తన సినీ కెరియర్‌ను ప్రారంభించి ఎన్నో సినిమాల్లో నటించి టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు. రవీతేజ తన కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు చూశాడు. ఆయన వద్దనుకున్న పలు హిట్ సినిమాలు ఇవే..
ఆనందం:
దర్శకుడు శ్రీను వైట్ల మొదటి సినిమాగా వచ్చిన సినిమా ఆనందం. ఈ సినిమా కథను ముందుగా దర్శకుడు రవితేజకే చెప్పాడట. రవితేజకు కథ నచ్చకపోవడంతో సినిమాని రిజెక్ట్ చేశాడు.
 
ఆర్య:
సేషనల్ డైరెక్టర్ సుకుమార్ మొదటి సినిమాగా వచ్చిన ఆర్య సినిమా కథను ముందుగా సుకుమార్ రవితేజకే చెప్పారట.. కానీ రవితేజకు ఈ సినిమాలో ఉన్న లవ్ ట్రాక్ నచ్చకపోవడంతో.. రవితేజ ఈ సినిమాను వద్దనుకున్నాడు. అప్పుడు సుకుమార్ ఇదే కథతో అల్లు అర్జున్ తో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
 
గోదావరి:
వైవిద్యమైన సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల ఆయన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన గోదావరి సినిమా కథను శేఖర్ కమ్ముల ముందుగా రవితేజకే చెప్పాడట. ఆ టైంలో రవితేజ విక్రమార్కుడు సినిమా షూటింగ్‌లో బిజీగా ఉండటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
 
గబ్బర్ సింగ్:
పవన్ కళ్యాణ్ కు అదిరిపోయే హిట్ ఇచ్చిన సినిమా గబ్బర్ సింగ్. సినిమాకు దర్శకత్వం వహించిన హరీష్ శంకర్.. ఈ సినిమాను ముందుగా రవితేజతో తీయాలని అనుకున్నాడట. ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ పవన్ కళ్యాణ్ దగ్గర ఉండటంతో ఆయనతో సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు.
 
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు:
వెంకటేష్- మహేష్ బాబు కాంబోలో మల్టీస్టారర్ సినిమాగా వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు నటించిన పాత్రకు ముందుగా రవితేజని అనుకున్నారట.. తర్వాత కొన్ని అనుకోని కారణాల వల్ల ఆ పాత్రకు మహేష్ బాబును తీసుకున్నారు అని తెలుస్తుంది.
 
ఎంసీఏ:
నాని హీరోగా వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఎంసీఏ సినిమా కథను దర్శకుడు ముందుగా రవితేజకు చెప్పాడట.. రవితేజకు స్టోరీ నచ్చకపోకుండా ఈ సినిమాని రిజెక్ట్ చేశాడు. తర్వాత వేణు శ్రీరామ్ ఈ కథను నానితో తీసి సూపర్ హిట్కొట్టాడు.
 
జై లవకుశ:
ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంతో బాబీ డైరెక్షన్ లో వచ్చిన జై లవకుశ సినిమా ఎంతో సూపర్ హిట్ అయింది. అయితే ఈ సినిమాని బాబి ముందుగా రవితేజ తో తీయాలనుకున్నాడట.. రవితేజ తన సినిమా షూటింగులతో బిజీగా ఉండడంతో.. ఈ సినిమాను ఎన్టీఆర్ తో తీసి ఎన్టీఆర్‌కు అదిరిపోయే హిట్ ఇచ్చాడు బాబి.
 
మహాసముద్రం:
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ హిట్ అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి… తన రెండవ సినిమాని రవితేజతో తీయాలనుకున్నాడు.. ఆయనకు స్టోరీ నచ్చకపోవటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.. తర్వాత దర్శకుడు ఇదే స్టోరీ తో శర్వానంద్ తో తీసి అట్టర్ ప్లాప్ ను తన కాతాలో వేసుకున్నాడు.
 
పోకిరి:
డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వచ్చిన సినిమా పోకిరి.. ఈ సినిమా మహేష్ బాబుకు అదిరిపోయే హిట్‌ ఇచ్చింది.. అయితే ఈ సినిమాను ముందుగా పూరీ జగన్నాథ్ రవితేజతో తీయాలనుకున్నాడు. ఆ టైంలో రవితేజ వరుస సినిమాలకు కమిట్ అవటంతో ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు.
 
బాడీగార్డ్:
వెంకటేష్ హీరోగా త్రిష హీరోయిన్ గా వచ్చిన సినిమా బాడీగార్డ్… ఈ సినిమాను ముందుగా దర్శకుడు రవితేజ తో తీయాలనుకున్నాడట.. రవితేజకు కథ నచ్చక పోవడంతో ఈ సినిమాను వెంకటేష్‌తో తీశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: