దీపిక వరల్డ్ రికార్డ్.. టాప్ 10 అందగత్తెల్లో స్థానం?

Purushottham Vinay
అందమైన భామలు ఎంత మంది ఉన్నా. ఇంకా అలాగే సీనియర్లు ఎంత మంది పోటీగా ఉన్నా కూడా దీపిక స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. బాలీవుడ్ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూనే హాలీవుడ్ లో కూడా దీపిక మెరుస్తోంది.తన అందం..అభినయంతో ఇంగ్లీష్ ఆడియన్స్ ని కూడా ఈమె ఫిదా చేస్తుంది. ఇప్పటికే పలు జాతీయ..అంతార్జాతీయ స్థాయిలో ఫేమస్ అయిన దీపక అందానికి మరో అరుదైన గౌరవం దక్కింది. ప్రపంచంలోనే తొలి పదిమంది అందగత్తెల్లో ఒకరిగా స్థానం సంపాదించింది. `ది గోల్డెన్ రేషియో ఆఫ్ బ్యూటీఫై` అనే పేరుతో ఓ జాబితా రిలీజ్ అయింది.లండన్ కు చెందిన ఫేమస్ ప్లాస్టిక్ సర్జన్ జులియన్ డిసిల్వా దీన్ని రూపొందించారు. సైంటిఫిక్ ప్రమాణాల ప్రకారం ప్రతీ ఏడాది లాగే 2022 ఏడాదికిగాను తన జాబితాను రిలీజ్ చేసారు. ఈ జాబితాలో దీపిక 91.22 శాతంతో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో తొలి స్థానంలో జోడీ కామర్ నిలిచారు. శారీరక పరిపూర్ణతకు సంబంధించిన అన్ని అంశాల్లో ఈమె ముఖంలో ఉన్నాయని ఆమెకు ఫస్ట్ ప్లేస్ ని కట్టబెట్టారు.


ఆ తరువాత ఇంకా బియాన్స్.. ఆరియానా గ్రాండ్..టైలర్ స్విప్ట్..కిమ్ కర్దాషియన్ వంటి ప్రపంచ సుందరీ మణులు ఈ జాబితాలో స్థానం సంపాదించారు. దీపిక ఈ సర్వేలో నిలవడం ఇదే మొదటిసారి. ఫ్యాషన్ వరల్డ్ లో ఇలాంటి స్థానాలు దీపికకి కొత్తేం కాదు. ఫ్యాషన్ ప్రియురాలిగతా ఎన్నో అవార్డులు..రివార్డులు సొంతం చేసుకుంది. ఇటీవల జరిగిన కేన్స్ ఉత్సవాల్లో దీపిక మెరిసిన సంగతి తెలిసిందే. దీపిక ఫ్యాషన్ ఎంపికలకు ప్రపంచమే దాసోహమైంది. డిజైనర్ దుస్తుల్లో జ్యూరీ సహా అందర్నీ ఎంతగానో అలరించింది.ప్రస్తుతం దీపిక ప్రభాస్ కి జోడీగా నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రాజెక్ట్ కె సినిమాలో నటిస్తుంది. ఇంకా అలాగే షారుఖ్ ఖాన్ సరసన పఠాన్ సినిమాలో నటిస్తుంది.ఈ రెండు సినిమాలు కూడా పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్నాయి.మరి చూడాలి ఈ సినిమాలు దీపికాకి ఎంత క్రేజ్ తీసుకొస్తాయో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: