ప్రమోషన్స్ లో బిజీగా వున్న ఎన్టీఆర్..!!

murali krishna
ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం అయితే లేదు. ఆర్ఆర్ఆర్ జపాన్‌లో కూడా అక్టోబర్ 21న విడుదల కానుంది.

ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే ప్రమోషన్స్ లో మొదలు పెట్టాడు పాల్గొంటున్నాడు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan) కాంబినేషన్ లో తెరకెక్కిన పాన్ ఇండియా సినిమా ఆర్ఆర్ఆర్ (RRR). ఎస్ఎస్ రాజమౌళి (SS Rajamouli) డైరెక్ట్ చేసిన ఈ మూవీ బాక్సాఫీస్ ను ఎలా షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆర్ఆర్ఆర్ వరల్డ్ వైడ్‌గా రూ.1100 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి రికార్డులు అయితే సృష్టించింది.

కాగా ఆర్ఆర్ఆర్ అక్టోబర్ 21న జపాన్‌లో కూడా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రమోషన్స్ మొదలు పెట్టాడట.ఇప్పటికే ఎన్టీఆర్ జపనీస్ మీడియాతో చిట్ చాట్ లో కూడా పాల్గొన్నాడు. కాగా ఇపుడు ప్రత్యక్షంగా ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రచార కార్యక్రమాల్లో కూడా పాల్గొనేందుకు జపాన్‌కు బయలుదేరాడు తారక్‌.

ట్రావెల్‌ బ్యాగ్‌ అండ్‌ సూట్‌కేస్‌తో తారక్‌ ఎయిర్‌పోర్టు నుంచి వెళ్తున్న స్టిల్స్‌ ఇపుడు నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఆర్‌ఆర్‌ఆర్‌ త్వరలోనే జపాన్‌లో కూడా రికార్డుల వేట మొదలుపెట్టనుందని తారక్‌ ప్రమోషన్స్‌ అప్‌డేట్‌తో అర్థమవుతుందట.. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఆర్‌ఆర్‌ఆర్‌ లో రాంచరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించగా.. ఎన్టీఆర్ కొమ్రంభీం పాత్ర లో నటించాడు.

బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, ఉక్రెయిన్ భామ ఒలీవియా మొర్రీస్ ఫీ మేల్ లీడ్ రోల్స్ లో నటించారు. డీవీవీ ఎంటర్‌టైన్ మెంట్స్ బ్యానర్ ‌పై నిర్మాత డీవీవీ దానయ్య భారీ బడ్జెట్‌తో ఆర్ఆర్ఆర్‌ను తెరకెక్కించారు. త్వరలో నే కొరటాల శివతో చేయనున్న NTR30 సినిమాను కూడా మొదలుపెట్టనున్నాడట తారక్. ఈ ప్రాజెక్ట్ ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఫుల్ స్పీడుమీదున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: