వైరల్ గా మారిన కీర్తి సురేష్ మాస్ లుక్ !

Seetha Sailaja

మాస్ పాత్రలకి అదేవిధంగా గ్లామర్ షోకు కీర్తి సురేష్ ఫిజిక్ అంతగా సరిపోదు. అయితే టాప్ హీరోయిన్ గా నిలబడాలి అంటే ఈ రెండు విషయాలలో కూడ ఆమెకు క్రేజ్ ఏర్పడాలి. ‘సర్కారు వారి పాట’ మూవీలో కీర్తి గ్లామర్ షో చేసినప్పటికీ అది పెద్దగా యూత్ కు కనెక్ట్ కాలేదు.

దీనితో హీరోయిన్స్ మధ్య పోటీ తీవ్రంగా పెరిగిన నేటి పరిస్థితులలో గ్లామర్ క్వీన్ గా రాణించడానికి ఎన్ని ప్రయత్నాలు ఉంటాయో అన్ని ప్రయత్నాలు కీర్తి చేస్తూ తన స్థానం పడిపోకుండా నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాలలో భాగంగా నాని తో ఆమె నటిస్తున్న లేటెస్ట్ మూవీ దసరా మూవీలోని కీర్తి మాస్ లుక్ అవతారాన్ని కీర్తి సురేష్ పుట్టినరోజు సందర్భంగా ఆమూవీ నిర్మాతలు విడుదల చేసారు.

పసుపు రంగు చీరలో పెళ్ళికూతురు లుక్ లో అనేకమంది డాన్సర్స్ మధ్య మాస్ స్టెప్ వేస్తూ కీర్తి కనిపిస్తున్న ఈ పోష్టర్ విడుదలైన కొన్ని గంటలలోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రస్తుతం పరాజయాల బాటలో ఉన్న నాని కెరియర్ కు అత్యంత కీలకంగా గా మారిన దసరా మూవీ వచ్చే ఏడాది మార్చిలో రాబోతున్న ఉగాది రోజున విడుదల కాబోతోంది.

నాని కెరియర్ లో ఇప్పటివరకు ఏ సినిమాకు అవ్వనంత భారీ బడ్జెట్ ఈమూవీ పై ఖర్చు పెట్టారు. దీనికితోడు ప్రస్తుతం నాని కెరియర్ అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ఈమూవీ బిజినెస్ భారీ స్థాయిలో జరగడం ఇండస్ట్రీ వర్గాలను ఆశ్చర్య పరుస్త్గొంది. లేటెస్ట్ గా ఓటీటీ లో విడుదలైన ‘అంటే సుందరానికి’ మూవీకి అతి తక్కువ రేటింగ్స్ రావడంతో నాని కెరియర్ పై మరికొందరికి సందేహాలు ఏర్పడుతున్నాయి. ఒకవైపు నాని తో పాటు కీర్తి సురేష్ కెరియర్ కూడ అంతంత మాత్రంగా ఉండటంతో దసరా మూవీ వీరిద్దరి కెరియర్ కు అత్యంత కీలకంగా మారింది అనడంలో ఎటువంటి సందేహం లేదు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: