ఆ తేదీన డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్న "కృష్ణ వ్రింద విహారి" మూవీ..?

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న యువ హీరో లలో ఒకరు అయిన నాగ శౌర్య గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నాగ శౌర్య ఇప్పటికే ఎన్నో తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తన కంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. ఇది ఇలా ఉంటే నాగ శౌర్య కొన్ని రోజుల క్రితమే లక్ష్య అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ మూవీ లో హీరోగా నటించాడు. ఈ మూవీ కోసం నాగ శౌర్య అదిరి పోయే రేంజ్ లో బాడీని కూడా పెంచాడు. ఈ మూవీ లో నాగ శౌర్య సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ హీరోయిన్ గా నటించింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన లక్ష్య సినిమా బాక్సా ఫీస్ దగ్గర ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించ లేక పోయింది. ఇలా లక్ష మూవీతో ప్రేక్షకులు నిరుత్సాహపరిచిన నాగ శౌర్య తాజాగా కృష్ణ వ్రింద విహారి అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే.

ఈ మూవీ కి అనీష్ ఆర్ కృష్ణ దర్శకత్వం వహించగా , షెర్లీ సెటియా , రాధిక , వెన్నెల కిశోర్ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయ్యి ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించిన కృష్ణ వ్రిందా విహారి మూవీ మరి కొన్ని రోజుల్లోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కృష్ణ వ్రింద విహారి ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో అక్టోబర్ 23 వ తేదీ నుండి స్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: