సమంత "యశోద" మూవీ విడుదల తేదీ వచ్చేసింది..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ ఉన్న నటి మనులలో ఒకరు అయిన సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఏం మాయ చేసావే మూవీ తో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కొనసాగుతుంది. పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత ఈ సాంగ్ లో తన అందచందాలను ఆరబోసి ,  అలాగే తన డాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకొని ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా సమంత "యశోద" అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి హరి శంకర్ - హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , ఉన్ని ముకుంద‌న్‌ ,
వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేశ్ , మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలో నటించారు.

ఇది ఇలా ఉంటే తాజాగా యశోద మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఒక అదిరిపోయే అప్డేట్ ను విడుదల చేసింది. తాజాగా యశోద మూవీ యూనిట్ ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. యశోద మూవీ ని 11 నవంబర్ 2022 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో ఈ మూవీ పై సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: