రేణు దేశాయ్ అయినా రవితేజ కెరియర్ మార్చేనా..?

Divya
హీరో రవితేజ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు. రవితేజ చివరిగా క్రాక్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు ఇక తర్వాత విడుదలైన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో తన తదుపరి చిత్రాల పైన మొత్తం ఫోకస్ పెట్టారు రవితేజ ప్రస్తుతం రవితేజ నటిస్తున్న రావణాసుర ధమాకా చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇక తర్వాత ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వరరావు.
ఇక టైగర్ నాగేశ్వరరావు ఒక స్టువర్టుపురం గజదొంగగా పేరు పొందిన టైగర్ నాగేశ్వరరావు జీవిత కథ ఆధారంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి ఐదు భాషలలో విడుదల చేయబోతున్నారు. ఇందులో నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్ గా నటిస్తూ ఉన్నారు. ఈ చిత్రంలోని ఒక కీలకమైన పాత్రలో హీరోయిన్ రేణు దేశాయ్ నటిస్తున్నది. ఇటీవల ఆ సినిమాలో తన పాత్రకు సంబంధించి అప్డేట్ ను ప్రకటించింది చిత్ర బృందం. డైరెక్టర్ వంశీ దర్శకత్వంలో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్లో జరుపుకుంటూ ఉన్నది. ఈ చిత్రంలో రేణు దేశాయ్ పాత్ర హేమలత లవణం అనే ఇదివరకే ప్రకటించడం జరిగింది.
రేణు దేశాయ్ పాత్రకు సంబంధించి పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుందని టైగర్ నాగేశ్వరరావు పాత్రకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉంటుందని సమాచారం. 22 ఏళ్ల క్రితం పవర్ నటించిన భద్రి చిత్రంతో ఎన్నో మొదటిసారిగా టాలీవుడ్ కు పరిచయమైంది. ఆ తరువాత ప్రభుదేవాతో జేమ్స్ బాండ్, పవన్ కళ్యాణ్ తో జానీ సినిమాలలో మాత్రమే నటించింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వివాహం చేసుకొని దాదాపుగా 20 ఏళ్ల తర్వాత టైగర్ నాగేశ్వరరావు సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దీంతో ఈ సినిమా పైన మరింత ఆసక్తి నెలకొంది అభిమానులలో. మరి రవితేజ కెరియర్ను ఈ చిత్రం మారుస్తుందేమో చూడాలి మరి

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: