ఆ డైరెక్టర్స్ ను నమ్మి మోసపోతున్న హీరోలు..!!

murali krishna
టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు దర్శకులకు కథ, కథనం విషయంలో పూర్తిస్థాయిలో ఫ్రీడమ్ ఇస్తున్నారు. స్క్రిప్ట్ లో ఏ మాత్రం వేలు పెట్టకుండా దర్శకులు చెప్పిన విధంగా నటిస్తున్నారట..


అయితే చాలామంది దర్శకులు హీరోలు ఇచ్చిన ఫ్రీడమ్ ను మిస్ యూజ్ చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ గడిచిన 20 సంవత్సరాలలో ఎంతోమంది యంగ్ డైరెక్టర్లకు, కొత్త డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు కూడా ఛాన్స్ ఇచ్చారు.


అయితే బోయపాటి శ్రీను మినహా ఆయన ఇచ్చిన ఛాన్స్ ను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్న దర్శకులు తక్కువేననే విషయం తెలిసిందే. కొందరు దర్శకులు తీసిన సినిమాలు బాలయ్యపై విమర్శలు రావడానికి కారణమయ్యాయి. కథలో జోక్యం చేసుకోవడానికి ఇష్టపడని బాలయ్య కొన్నిసార్లు దర్శకులు చేసిన తప్పుల వల్ల విమర్శలు కూడా మూటగట్టుకున్నారు. సింహా సినిమా కథ చెప్పడానికి బోయపాటి శ్రీను బాలయ్య దగ్గరకు వచ్చిన సమయంలో బాలయ్య చాలామంది దర్శకులు తన నమ్మకాన్ని వమ్ము చేశారని మీరైనా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని కామెంట్ చేశారంటే ఫ్లాపుల వల్ల బాలయ్య ఎంత బాధపడ్డారో మరీ అర్థమవుతుంది.


మరో స్టార్ హీరో నాగార్జున యంగ్ డైరెక్టర్లకు, టాలెంటెడ్ డైరెక్టర్లకు వరుసగా ఛాన్స్ లు ఇస్తున్నారు. అయితే గత కొన్నేళ్లలో చాలామంది దర్శకులు నాగార్జునకు ఊహించని రేంజ్ లో డిజాస్టర్లు ఇచ్చి నాగ్ సినీ కెరీర్ నే ఇబ్బందుల్లోకి నెట్టారు. స్టార్ డైరెక్టర్లకు దూరంగా ఉండి యంగ్ డైరెక్టర్లను నమ్మిన నాగ్ కు ఇలాంటి ఫలితాలు వస్తాయని ఫ్యాన్స్ సైతం ఊహించలేదట.


మరో టాలెంటెడ్ హీరో నితిన్ సైతం దర్శకులను నమ్మి మోసపోతున్నారు. నితిన్ తాజాగా కొత్త డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డికి ఛాన్స్ ఇవ్వగా మాచర్ల నియోజకవర్గం సినిమా ఫలితం తెలిసిందే. మరో యంగ్ హీరో నాగశౌర్యకు సైతం వెంకీ కుడుముల మినహా మిగతా డైరెక్టర్లు వరుస షాకులిచ్చారు. సొంత బ్యానర్ లో తెరకెక్కిన సినిమాలు సైతం నాగశౌర్యకు కూడా షాకిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: