హీరోయిన్స్ లేకుండానే బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్న హీరోలు వీళ్లే..!!

murali krishna
సాధారణంగా ఒక సినిమాకు కథ, కథాంశం ఎంత అయితే ఇంపార్టెంటో.. హీరో హీరోయిన్లు కూడా అంతే ప్రాముఖ్యతను సంతరించుకుంటారు. ఆ సినిమాను చూడడానికి హీరోని చూసి వెళ్తే ..
మరి కొంతమంది హీరోయిన్ ను చూడడానికి సినిమాకు వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ కొంతమంది హీరోలు మాత్రం హీరోయిన్లతో పని లేకుండా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలను సొంతం చేసుకోవడం జరిగింది. ఇక అలా హీరోయిన్లు లేకుండానే బాక్స్ ఆఫీస్ దగ్గర రఫ్ఫాడించిన హీరోల గురించి ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్.. దసరా సందర్భంగా విడుదలైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ లేకుండానే సింగిల్ గా చిరంజీవి నటించి మెప్పించారు. ఇక ఇదే తరహాలో గతంలో చిరంజీవి మేజర్, బంధాలు అనుబంధాలు అనే సినిమాలలో కూడా హీరోయిన్ లేకుండానే సింగిల్ గానే మెప్పించారు. ఇక బాలకృష్ణ కూడా టైటిల్ రోల్ లో యాక్ట్ చేసిన వేములవాడ భీమకవి అనే సినిమాలో హీరోయిన్ లేకుండానే ఒంటరిగా నటించి మెప్పించారు.. తర్వాత శ్రీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కళ్యాణం లో నారదుడు పాత్రలో కథానాయక లేకుండానే మెప్పించారు.
ఇక గత ఏడాది చివర్లో బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ అఖండ సినిమాలో కూడా టైటిల్ పాత్రధారికి కథానాయక లేదు. ఇక బాలయ్య ఇప్పటివరకు డ్యూయల్ రోల్ లో ఎన్ని సినిమాల్లో చేసినా..అన్ని సినిమాల్లో ఇద్దరు హీరోలకు ఇద్దరు కథానాయకులు ఉన్నారు కానీ ఈ సినిమాలో ఇంకో పాత్రకు కథానాయక లేదు. నాగార్జున కూడా షిరిడి సాయి, గగనం వంటి సినిమాలలో హీరోయిన్ లేకుండానే నటించి మెప్పించారు. ఆ తర్వాత రాజు గారి గది 2, ఆఫీసర్ వంటి సినిమాల్లో కూడా హీరోయిన్ లేదు. ఇక అలాగే వెంకటేష్ నటించిన ఈనాడు సినిమా, కమలహాసన్ నటించిన విక్రమ్ సినిమా లో కూడా హీరోయిన్స్ లేరు అలా హీరోయిన్స్ లేకుండానే ఈ హీరోలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: