ఎన్టీఆర్ కోసం పూర్తి కథను మార్చేసిన కొరటాల...!!

murali krishna
టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు కొరటాల శివ. అప్పటివరకు రచయితగా ఉన్న కొరటాల ప్రభాస్ నటించిన మిర్చి తో దర్శకుడిగా మారారు.


మిర్చి మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో కొరటాల పేరు అయితే మారుమ్రోగింది. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు వరుస ఆఫర్లు క్యూకట్టాయి. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోలతో లు చేశారు కొరటాల శివ. మిర్చి తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మరోసారి మహేష్ బాబుతో భరత్ అనే నేను లు చేశారు కొరటాల శివ. ఇక ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య చేశారట.ఈ లో చిరంజీవితో పాటు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించారు. అయితే భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అసలు ఇది కొరటాల శివ నేనా అనేలా తీశారు అంటూ కామెంట్స్ కూడా వినిపించాయి. ఇక ఇప్పుడు కొరటాల యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో చేస్తున్నారు.


ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నటిస్తున్న కావడంతో ఈ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఆచార్య ఎఫెక్ట్ ఏమాత్రం పడకుండా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారట కొరటాల. అందుకోసమే ఎక్కువ టైం తీసుకుంటున్నారట. అయితే ఇక ఈ ను కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించనున్నారు. కొరటాల మాత్రం ఈసారి సాలిడ్ హిట్ కొట్టి.. గట్టి కామ్ బ్యాక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారట.. ఈ మేరకు ఓ అదిరిపోయే కథను సిద్దం చేస్తున్నారు. ఇప్పటికే ఈ నుంచి మోషన్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. తారక్ పవర్ఫుల్ డైలాగ్ తో ఈ మోషన్ పోస్టర్ ను డిజైన్ చేశారట.అయితే ఆ తర్వాత ఇంతవరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అటు ఈ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న తారక్ అభిమానులు. తాజాగా ఈ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ముందుగా ఈ కోసం కొరటాల అనుకున్న కథను ఇప్పుడు పక్కకు పెట్టి. మరో కథను సిద్ధం చేస్తున్నారట కొరటాల. ఎన్టీఆర్ పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకొని కథను మార్చినట్టు తెలుస్తోంది. తాను ముందుగా అనుకున్న కథ కంటే ఇప్పుడు పవర్ ఫుల్ కథను రెడీ చేస్తున్నారట. ఇక ఈ లో రష్మిక కానీ కీర్తి సురేష్ కానీ హీరోయిన్ గా నటించే ఛాన్స్ అయితే ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: