ఛీ..ఛీ.. బాలకృష్ణను చూస్తుంటే అసహ్యం వేస్తోంది.. లక్ష్మీ పార్వతి..!

murali krishna
ఎదైనా ఒక షోని పాపులర్ చేయాలి అనుకుంటే విరుద్ధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా పాపులర్ అవుతారని చెప్పడంలో సందేహం లేదు. ఇక ఈ క్రమంలోనే కొంతమంది పాజిటివిటీని మూటగట్టుకుంటే మరికొంతమంది నెగెటివిటీని మూట కట్టుకోవాల్సి వస్తుందిగోటితో పోయేదాన్ని గొడ్డలితో తెచ్చుకోవడం అంటే ఇదేనేమో.. అన్నట్లుగా మారింది బాలకృష్ణ పరిస్థితి. అసలు ఏమైందంటే ఆయన బుల్లితెరపై హోస్టుగా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె మొదటి సీజన్ పూర్తీ అయింది. ఇప్పుడు రెండవ సీజన్లో మొదటి ఎపిసోడ్ కి టిడిపి అధినేత , మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పుత్రుడు నారా లోకేష్ ఈ షో కి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఇక వ్యక్తిగత, రాజకీయ అంశాలను ప్రస్తావిస్తూ మాట్లాడడంతో ఎప్పుడెప్పుడు ఈ ఎపిసోడ్ ఎలికాస్ట్ అవుతుందా అని అభిమానులతో పాటు రాజకీయ నాయకులు కూడా వెయ్యి కళ్లతో ఎదురు చూశారు. కానీ నిన్న సాయంత్రం ఎట్టకేలకు ఎపిసోడ్ ఆహా లో స్ట్రీమింగ్ అవడం మొదలైంది. ఇక ఎప్పుడైతే ఈ ఎపిసోడ్ బయటకు వచ్చిందో టిడిపి పై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలోని తాజాగా ఈ ఎపిసోడ్ పై ఎన్టీఆర్ రెండవ భార్య లక్ష్మీపార్వతి స్పందించింది.. చంద్రబాబు, బాలయ్య తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ షోను ఎంచుకున్నారని.. అందులో వారు చెప్పిన ఏ విషయంలో కూడా నిజం లేదు అని ఆమె చెప్పుకోచ్చింది.
1995 ఘటనలో చంద్రబాబు వివరణ ఇస్తూ.. ఆ సమయంలో ఎన్టీఆర్ కాళ్లు పట్టుకొని బ్రతిమలాడాను.. ఆయన వినలేదు అని చెప్పారు.. కానీ ఈ వాక్యాలను లక్ష్మీపార్వతి ఖండించింది. పార్టీలో గొడవలు చేయించింది అతనే.. ఎన్టీఆర్ గారికి వ్యతిరేకంగా రోడ్డు మీదకు పిలిచింది.. ఎమ్మెల్యేలను రెచ్చగొట్టింది.. ఇవన్నీ ఆయన ఒప్పుకోమనండని సవాలు కూడా విసిరింది. చంద్రబాబు .. ఎన్టీఆర్ కాళ్లు పట్టుకున్నాడు అనేది పచ్చి అబద్ధం అని కూడా తేల్చి చెప్పింది. అంతేకాదు ఈరోజు ఈ షో చూశాక బాలయ్య అంటే అసహ్యం వేస్తోంది. ఛీ ఛీ అసలు ఎన్టీఆర్ కొడుకేనా అన్నంత అసహ్యం కూడా కలుగుతుంది అంటూ ఆమె తెలిపింది. ఈ షో చూస్తున్నంత సేపు ఎన్టీఆర్ కి ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారిద్దరూ ఒకరికొకరు సమర్ధించినట్లు కనిపించింది అని , ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచింది చంద్రబాబు నాయుడు అని సాక్షాలు బయటపడడంతో ఈ విధంగా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని కూడా ఆమె వ్యాఖ్యానించారు. ఈ వివాదం ఎంతవరకు వెళ్తుందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: