అంజలి "ఝాన్సీ" వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ తేది ఫిక్స్..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీ మణులలో ఒకరు అయిన అంజలి గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అంజలి ,  వెంకటేష్ , మహేష్ బాబు హీరో లుగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తో అద్భుతమైన విజయాన్ని అలాగే ఎంతో మంది తెలుగు ప్రేక్షకుల మనసును కూడా దోచుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ లో అంజలి తన నటన తో ఎంతో మంది తెలుగు సినీ ప్రేమికుల మనసు దోచుకుంది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీ తర్వాత అంజలి అనేక తెలుగు మూవీ లలో నటించి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అంజలి ,  మేక పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో ఒక కీలకమైన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా మూవీ గా రూపొందుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ ముద్దు గుమ్మ ఝాన్సీ అనే వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ వెబ్ సిరీస్ యాక్షన్ డ్రామా జోనర్ లో తెరకెక్కింది. ఈ వెబ్ సిరీస్ కు తిరు దర్శకత్వం వహించాడు. ఈ వెబ్ సిరీస్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఝాన్సీ వెబ్ సిరీస్ అక్టోబర్ 27, 2022 నుండి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ వెబ్ సిరీస్ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: