చిరంజీవి... పూరి జగన్నాథ్ కాంబినేషన్ పై ఆర్జీవి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Pulgam Srinivas
తాజాగా మెగాస్టార్ చిరంజీవి , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఇన్స్టా గ్రామ్ లైవ్ లో మాట్లాడుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ లైవ్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి మరియు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అనేక విషయాల గురించి చర్చించుకున్నారు. అందులో భాగంగా కొన్ని సంవత్సరాల క్రితం మెగాస్టార్ చిరంజీవి కోసం పూరి జగన్నాథ్ "ఆటో జానీ" అనే కథను రెడీ చేసి వినిపించగా ,  మొదట చిరంజీవి ఆ కథ ను ఓకే అని  , ఆ తర్వాత కొన్ని అని వార్య కారణాల వల్ల ఆ మూవీ ని పక్కన పెట్టేశాడు. తాజాగా ఇన్స్టా లో లైవ్ లో భాగంగా మెగాస్టార్ చిరంజీవి నా ఆటో జానీ కథ ఉందా లేదా అని పూరి జగన్నాథ్ ను అడిగాడు. దానితో పూరి జగన్నాథ్ లేదు సార్ ...  ఆ కథను ఎప్పుడో పక్కన పెట్టేసాను.  మీకోసం ఒక పవర్ఫుల్ కథను ఆటో జాని కి మించిన కథను రెడీ చేస్తున్నాను అని చెప్పాడు. దానితో మెగాస్టార్ చిరంజీవి మరియు పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక సినిమా త్వరలోనే రాబోతుంది అంటూ కొన్ని సంకేతాలు బయటికి వస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ,  మెగాస్టార్ చిరంజీవి ...  పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో ఒక మూవీ రాబోతుంది అనే వార్తలపై తనదైన రీతిలో స్పందించాడు. ఇద్దరు ప్యాషన్‌ తో కూడిన సినిమా వ్యక్తుల సమ్మేళనం అని రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్వీట్ చేశారు. రామ్ గోపాల్ వర్మ కూడా ఈ కాంబినేషన్ కోసం వెయిట్ చేస్తున్నట్టు తాజాగా తెలిపారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ,  బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీ లోను , మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భోళా శంకర్ మూవీ లోను హీరోగా నటిస్తున్నాడు. పూరి జగన్నాథ్ ఆఖరుగా విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన లైగార్ మూవీ కి దర్శకత్వం వహించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: