సత్తా చాటుకున్న సాయిధరమ్ తేజ్!

murali krishna
మెగాస్టార్ మేనల్లుడైనా, ఏ స్టార్ అల్లుడైనా, కొడుకైనా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటే సరిపోదు. నిజంగా పస లేకుంటే, ఆ చెట్టు పేరు ఎంత చెప్పినా కాయలు అమ్ముడు పోవు.
యంగ్ హీరో సాయిధరమ్ తేజ్  మేనమామ చిరంజీవి నీడనే చిత్రసీమలో అడుగు పెట్టారు. తనకంటూ ఓ గుర్తింపు సంపాదిం చుకున్నారు. మేన మామలు చిరంజీవి, నాగబాబు, పవన్ కళ్యాణ్ పేరు నిలబెడుతూ, తన సత్తా చాటుకున్నారు సాయిధరమ్.
సాయిధరమ్ తేజ్ 1986 అక్టోబర్ 15న జన్మించారు. చిరంజీవి చెల్లెలు విజయ దుర్గ పెద్దకొడుకు సాయి ధరమ్ తేజ్. హైద రాబాద్ యూసఫ్ గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్ లో డిగ్రీ చదివారు సాయి ధరమ్. ఆయన తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా హీరోయే. ఇద్దరిలో నూ సాయి ధరమ్ ను చూస్తే మేనమామ చిరంజీవి పోలికలు మెండుగా కనిపిస్తాయి. చిరం జీవి వర్ధమాన కథానాయకునిగా సాగుతున్న రోజుల్లో ఎలా ఉండే వారో అలా సాయిధరమ్ ఆయనను గుర్తుకు తెస్తారు.
సాయిధ రమ్ తేజ్ తొ లుత వై.వి.ఎస్.చౌదరి రూపొందించిన ‘రేయ్’లో నటించినా, ఆ సినిమా కంటే ముందు ‘పిల్లా  నువ్వులేని జీవితం’ చిత్రం విడుదలయింది. ఈ సినిమాvతోనే సాయిధరమ్ మంచి మార్కులు సంపాదించేశారు. ఏడు సంవత్సరాలలో 14 చిvత్రా ల్లో నటింvచేశారు. “సుబ్రహ్మ ణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, నక్షత్రం , చిత్రలహరి, ప్రతిరోజూ పండగే, సోలో బ్రతుకే సో బెటర్, రిప బ్లిక్” చిత్రా లు సాయిధరమ్ తేజ్ కు హీరోగా మంచి గుర్తింపు సంపాదించి పెట్టాయి. సాయిధరమ్ తో ఇంత కు ముందు ‘సోలో బ్రతుకే సో  బెటర్’ నిర్మించిన బి.వి.యస్.య న్. ప్రసాద్ తెరకె క్కిస్తున్న చిత్రంలో సాయిధ రమ్ హీరోగా నటిస్తు న్నారు. కార్తిక్ దండు ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయం అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: