కొత్త కెప్టెన్ గా సూర్య.. పెరగనున్న రొమాన్స్ మోతాదు.. మరో జంటకు మరింత ప్లస్

murali krishna
కొత్త కెప్టెన్ గా సూర్య.. పెరగనున్న రొమాన్స్ మోతాదు.. మరో జంటకు మరింత ప్లస్
బిగ్ బాస్ తెలుగు 6వ సీజన్ ఎమోషనల్ టాస్క్, ఫిజికల్ టాస్క్ లతో ఈ వారం మంచి రసవత్తరంగా సాగింది. బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ పేరిట హౌజ్ మేట్స్ కు వారి ఇంట్లో నుంచి సర్ ప్రైజ్ లు ఉంటాయని చెబుతూ ఎమోషనల్ గా పిండేశాడు.
తర్వాత కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ లో బాల్ గేమ్ తో ఆట ఆడుకున్నాడు. ఇక తాజాగా ప్రసారమైన అక్టోబర్ 14 శుక్రవారం నాటి 40వ రోజు 41 ఎపిసోడ్ లో కొత్త కెప్టెన్ గా ఫెమినిస్ట్ అని చెప్పుకునే ఆర్జే సూర్యను ఇంటి సభ్యులంతా కలిసి సెలెక్ట్ చేశారు. దీంతో హౌజ్ లో రొమాన్స్ ఇంకా బాగా పెరగనుందని విమర్శలు వస్తున్నాయి. అలాగే మరో జంటకు ప్రేక్షకుల నుంచి ఆదరణ లభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాళ్లోకి వెళితే..
బిగ్ బాస్ తెలుగు ఆరో సీజన్ అక్టోబర్ 14 శుక్రవారం నాటి 40వ రోజు 41 ఎపిసోడ్ లో కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో మొత్తం 8 మంది ఆది రెడ్డి, వాసంతి, శ్రీసత్య, రాజ శేఖర్, రోహిత్, సూర్య, రేవంత్, అర్జున్ కెప్టెన్సీ కంటెండర్లుగా గెలిచిన విషయం తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో కెప్టెన్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. సంచాలక్ గా ఫైమా వ్యవహరిస్తుందని తెలిపాడు. ఈ టాస్క్ లో భాగంగా 8 పూల కుండీలు పెట్టారు.
వారి పేరు ఉన్న పూల కుండీ కాకుండా..
దీంతో ఆదిరెడ్డి, వాసంతి ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఈ క్రమంలో ఆదిరెడ్డిని మరోసారి కెప్టెన్ గా చూడాలని అతనికి అవకాశం ఇచ్చారు. దీంతో వాసంతి కెప్టెన్ టాస్క్ నుంచి ఎలిమినేట్ అయింది. తర్వాత రేవంత్, శ్రీసత్య ఇద్దరిలో శ్రీసత్యకు అవకాశం ఇచ్చారు. దీంతో రేవంత్ ఎలిమినేట్ అయ్యాడు. అర్జున్-రోహిత్ లలో రోహిత్ కు అవకాశం రాగా అర్జున్ ఎలిమినేట్ అయ్యాడు. అనంతరం శ్రీసత్య-రోహిత్ లలో ఒకరిని ఎంపిక చేసుకునే ఛాన్స్ వచ్చింది.
ఇంటి కెప్టెన్ గా సెలెక్ట్..
ఈ ఇద్దరిలో మళ్లీ రోహిత్ కు అవకాశం రాగా శ్రీసత్య ఎలిమినేట్ అయింది. ఆదిరెడ్డి తన పూల కుండీని తానే తెచ్చుకుని డిస్ క్వాలీఫై అయ్యాడు. ఇక ఫైనల్ గా ఆర్జే సూర్య, రోహిత్ మిగిలారు. వీరిద్దరిలో ఎక్కువ ఓట్లతో ఆర్జే సూర్య ఇంటి కెప్టెన్ గా సెలెక్ట్ అయ్యాడు. దీంతో ఫినోలెక్స్ పైపులపై ఆర్జే సూర్యను కూర్చుండపెట్టి బిగ్ బాస్ తెలుగు ఆరో 6వ సీజన్ ఆరో వారం ఇంటి కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు.
ఒకరి నోట్లో పెట్టుకుని మరొకరు..
అయితే హౌజ్ లో ఆర్జే సూర్య, ఇనయా సుల్తానా మధ్య జరిగే రొమాన్స్ సంగతి తెలిసిందే. పక్కపక్కనే కూర్చోవడం, ఒకరిచేత్తో మరొకరు తినిపించుకోవడం, ఒకే చోట పడుకోవడం, మోతాదుకు మించి హగ్గులు, ముద్దులకు మించి మొన్నటి ఎపిసోడ్ లో లాలిపాప్ ను ఒకరి నోట్లో పెట్టుకుని మరొకరు చప్పరించడం వంటి చాలానే చేశారు. ఇప్పుడు ఆర్జే సూర్య ఇంటి కెప్టెన్ కావడంతో వారిద్దరి మధ్య రొమాన్స్ మరింత పెరగనుందని ప్రేక్షకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సూర్య పేరు ఎత్తితే చాలు..
ఇప్పటికే వాళ్లిద్దరి మధ్య రొమాన్స్ శ్రుతిమించుతోందని, ఇలా చేస్తే బిగ్ బాస్ షోపై కోర్టులో కేసులు వేయరా అంటూ విమర్శలు సైతం వస్తున్నాయి. సూర్య కెప్టెన్ అయ్యాక వారిద్దరి మధ్య సాగే ఆ బంధం మోతాదు పెరుగుతుందని, ఇంకెన్ని దారుణాలు చూడాలో అని ఆడియెన్స్ అనుకుంటున్నట్లు టాక్. ఇప్పటికే తన గేమ్ ఆపేసి ఎప్పుడు సూర్య వెంటే ఉంటుంది ఇనయా సుల్తానా. సూర్య పేరు ఎత్తితే చాలు సిగ్గు పడిపోవడం, తాజా ఎపిసోడ్ లో అయితే బావా అని పిలవడం వంటివి చాలానే చేసింది.
సెల్ఫ్ నామినేట్ అయి..
ఇదిలా ఉంటే ఇంటి కెప్టెన్ గా ఆర్జే సూర్య అయ్యాడు కానీ ప్రేక్షకుల మనసును రోహిత్ గెలుచుకున్నాడనే టాక్ వినిపిస్తుంది. మొన్నటి బ్యాటరీ రీఛార్జ్ టాస్క్ లో రోహిత్ సెల్ఫ్ నామినేట్ అయి ఒక్కసారిగా అందరి మెప్పు పొందాడు. సెల్ఫ్ నామినేట్ అయినా కూడా త్యాగం చేసిన సర్ ప్రైజ్ ల విషయంలో తనకు తగిన ఇంపార్టెన్స్ ఇవ్వలేదని బాధపడ్డాడే గానీ, ఎవరితో చెప్పుకుని దాని గురించి ఆర్గ్యు చేయలేదు.
హౌజ్ లో ఫేవరిజం చూపించి..
ఈ రెండు మూడు రోజుల అతని బిహేవియిర్ తో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడని టాక్. నిజానికి ఇంటి కెప్టెన్ గా రోహిత్ కావాల్సిందని, హౌజ్ లో ఫేవరిజం చూపించి ఇంటి సభ్యులందరు రోహిత్ ను పక్కన పెట్టి సూర్యను కెప్టెన్ చేయడంపై ఆడియెన్స్ విముఖుత చూపిస్తున్నారట. అయితే ఇంటి సభ్యులు ఇలా చేయడం రోహిత్ అండ్ మెరీనా జంటకు మరింత ప్లస్ అవుతుందని అభిప్రాయపడుతున్నారు. వచ్చే రెండు వారాలు రోహిత్ నామినేషన్స్ లో ఉన్నాడు కాబట్టి అతనికి ఆడియెన్స్ నుంచి మంచి సపోర్ట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ వారం నామినేషన్లో ఉన్న మెరీనాకు కూడా ప్లస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: