ట్రైలర్:సర్దార్ సక్సెస్ అందుకునేలా ఉన్న కార్తీ..!!

Divya
తమిళ హీరోలు టాలీవుడ్లో క్రేజ్ సంపాదిస్తూనే ఉన్నారు. అలా మొదట యుగానికి ఒక్కడు చిత్రంతో నటుడుగా ఎంట్రీ ఇచ్చారు కార్తీ. ఇక తను చేసే ప్రతి సినిమా కూడా చాలా డిఫరెంట్ పాత్రలో ఎంచుకుంటూ ఉంటారు. ఇక ఇటీవలే తను నటించిన పోన్నియన్ సెల్వన్ మొదటి భాగం చిత్రంతో అలరించిన కార్తి ఇప్పుడు తాజాగా సర్దార్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రాన్ని పిఎస్ మిత్ర దర్శకత్వంలో పెరకెక్కించడం జరిగింది. ఇందులో హీరోయిన్స్ గా రజిషా విజయన్, రాశి ఖన్నా నటిస్తూ ఉన్నారు. దీపావళి కానుకగా ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ కూడా చాలా జోరుగా కొనసాగిస్తుంది చిత్ర బృందం.

ఇక ఇటీవల ఈ సినిమా సర్దార్ టీజర్ విడుదల కావడంతో ఈ సినిమా పైన మరింత అంచనాలు పెంచేసాయి ప్రమోషన్లలో భాగంగా తాజాగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు మేకర్. ఇందులో కార్తి ఒక భారతీయ గూఢచారిగా డిఫరెంట్ గెటప్పులలో కనిపిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సర్దార్ని పట్టుకోవడం అంత ఈజీ కాదు అని డైలాగ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇక ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కూడా కార్తి మరొకసారి కనిపించనున్నారు.

కార్తీ ఇందులో ఎన్నో విభిన్నమైన గెటప్పులు చేసి ప్రేక్షకుల సైతం చాలా ఆశ్చర్యపోతున్నారు ఇండియన్ మిలిటరీ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో సర్దార్ సినిమాని తెరకెక్కించినట్లు ఈ ట్రైలర్ చూస్తే మనకి అర్థమవుతుంది. ఇక అంతే కాకుండా మిలిటరీ రహస్యాలకు సంబంధించి ఒక ఫైల్ మిస్ అవడంతో దానికోసం కార్తీ ఎలా ప్రయత్నాలు కొనసాగిస్తాడు అని కథాంశంతో తెరకెక్కించినట్లుగా కనిపిస్తోంది. ఇక ఇందులో హీరోయిన్ల మధ్య కార్తీ లవ్ ట్రాక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో అలనాటి హీరోయిన్ లైలా కీలకమైన పాత్రలో కూడా నటిస్తోంది. ప్రస్తుతం సర్దార్ సినిమాకు సంబంధించి ట్రైలర్ వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: