మెగా ఫ్యాన్స్ కు దీపావళి సర్ ఫ్రైజ్..

Satvika
మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షించాడు.. గాడ్‌ఫాదర్‌ హిట్ తో అందరి దృష్టి మెగాస్టార్ సినిమా లపై పడింది.తనదైన మార్క్ యాక్షన్ తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు చిరు. గాడ్ ఫాదర్ గా ఇప్పుడు థియేటర్స్ ను దున్నేస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుంచే ఈ పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇక ఈ తర్వాత మరికొన్ని లు లైనప్ చేశారు వాటిలో మెగా 154 ఒకటి. మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర), మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ల క్రేజీ కాంబినేషన్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ మూవీ మెగా154. 



ప్రస్తుతం ఈ చిత్రానికి సంబధించిన షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఒక యాక్షన్ సీక్వెన్స్ ని చిత్రీకరిస్తున్నారు. మాస్ మహారాజా రవితేజ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నారు.మునుపెన్నడూ లేని విధంగా కమర్షియల్ బొనాంజా అందించడానికి మెగా మాస్ పూనకాలు తెప్పించేలా మెగా154′ రూపుదిద్దుకుంటుంది. తాజాగా ‘మెగా154’ టీమ్ ఈరోజు నుండి డబ్బింగ్ ప్రారంభించింది. 2023 సంక్రాంతికి విడుదల కానున్న నేపధ్యంలో షెడ్యూల్ ప్రకారం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అలాగే ‘మెగా154′ టైటిల్ టీజర్ అప్డేట్ కూడా వచ్చింది. దీపావళి కానుకగా టైటిల్ టీజర్ విడుదల కానుంది.



దీపావళికి బాస్ ఎక్సయిటింగ్ టీజర్. నేను బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూర్తి చేసాను. మీ అందరితో కలిసి మెగా మాస్ ఎంటర్ టైనర్ ను థియేటర్లలో చూడటానికి సంక్రాంతి వరకు ఆగలేకపోతున్నా’ అని దేవి అన్నారు.అన్ని కమర్షియల్ హంగులతో కూడిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మెగా 154కోసం ప్రముఖ నటులు, అత్యున్నత స్థాయి సాంకేతిక నిపుణులు వర్క్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి అనేక చార్ట్బస్టర్ ఆల్బమ్ లను అందించిన రాక్స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మెగా 154కి సంగీతం అందించనున్నారు..ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: