నాగచైతన్య 22వ మూవీ కోసం ఫుల్ క్రేజీ నటీనటులను రంగంలోకి దించిన మూవీ యూనిట్..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరో లలో ఒకరు ఆయన నాగ చైతన్య ప్రస్తుతం తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసింది. ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ గా రూపొందుతుంది. ఈ మూవీ కి ఇప్పటి వరకు చిత్ర బృందం టైటిల్ ను ఫిక్స్ చేయలేదు. దానితో ఈ మూవీ నాగ చైతన్య కెరియర్ లో 22 వ మూవీ కారుపొందుతూ ఉన్న నేపద్యంలో ఈ మూవీ యూనిట్ "#ఎన్ సి 22" అనే వర్కింగ్ టైటిల్ తో ఈ మూవీ చిత్రీకరణ ను జరుపుతుంది. ఈ మూవీ లో నాగ చైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఇది వరకే వీరిద్దరి కాంబినేషన్ లో బంగార్రాజు అనే మూవీ తెరకెక్కి మంచి విజయం సాధించింది. అలాగే ఈ మూవీ లో వీరిద్దరి జంటకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి.
 

ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వం లో తెరకెక్కుతున్న మూవీ నాగ చైతన్య మరియు కృతి శెట్టి కాంబినేషన్ లో రెండవ మూవీ.  ఇళయ రాజా , యువన్ శంకర్ రాజా ఈ మూవీ కి సంగీతాన్ని అందించబోతున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ రోజు ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లో నటించబోయే కొంత మంది నటీ నటుల పేర్లను విడుదల చేసింది. అందులో భాగంగా ఈ మూవీ యూనిట్ తాజాగా ఈ మూవీ లో ప్రియమణి ,  అరవింద స్వామి , శరత్ కుమార్ , వెన్నెల కిషోర్  , సంపత్ రాజ్  , ప్రేమ్ జీ అమరెన్ ,  ప్రేమి విశ్వనాథ్ ఈ మూవీ లో ముఖ్యమైన పాత్రలలో నటించబోతున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటిస్తూ వీరికి సంబంధించిన పోస్టర్ లను కూడా ఈ రోజు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం వీరికి సంబంధించిన పోస్టర్ లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: