ఎన్టీఆర్ - సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!

murali krishna
ఏ నటుడు లేదా నటి అన్ని సినిమాల్లో ఒకే పాత్ర చేయలేరు. ఒక సినిమాలో నటించిన హీరో, హీరోయిన్లు .. మరో సినిమాలో కూడా హీరో- హీరోయిన్లుగా నటిస్తారు అన్న గ్యారెంటీ లేదు.సరిగ్గా ఇలానే ఒక సినిమాలో తల్లిదండ్రులుగా చేసిన నటీనటులు మరో సినిమాలు అత్త- మామలుగా చేయవచ్చు. అందుకే ఓ సినిమా సెట్ పైకి వెళ్లే ముందు ఏ పాత్రకు ఎవరు సరిపోతారు అనే విషయం పై లుక్ టెస్ట్ వంటివి నిర్వహిస్తూ ఉంటారు. పాత్రలు మారుతూ ఉంటాయి కాబట్టి నటీనటుల ఆర్డర్ మారుతూ ఉంటుంది. అందుకే ప్రతీ సినిమాలోనూ నటీనటులు వాళ్ళే ఉన్నప్పటికీ వారి పాత్రలు మారుతూ ఉంటాయి. ఇటీవల వచ్చిన 'గాడ్ ఫాదర్' లో చిరు- నయన్ లు చూసిన తర్వాత… ఈ విషయం పై సోషల్ మీడియాలో చర్చ ఎక్కువైంది. అందుకోసమే గతంలో ఓ సినిమాలో జంటగా చేసిన నటీనటులు మరో సినిమాలో భార్యాభర్తలుగా చేసిన సందర్భాలు ఉన్నాయా లేవా అని అంతా రీసెర్చ్ చేస్తున్నారు. మనం మాత్రం ఈ టాపిక్ ను ఈజీగా వదిలేయడం ఎందుకు.. ఓ సినిమాలో భార్యాభర్తలుగా చేసి మరో సినిమాలో అన్నా చెల్లెళ్లుగా చేసిన జంట లేంటో ఓ లుక్కేద్దాం రండి :
1) ఎన్టీఆర్ - సావిత్రి :
ఈ జంట చాలా సినిమాల్లో హీరో హీరోయిన్లుగా చేశారు. అయితే రక్త సంబంధం సినిమాలో మాత్రం అన్నా చెల్లెళ్లుగా చేశారు.
2) చిరంజీవి - రమ్యకృష్ణ :
'చక్రవర్తి' సినిమాలో చిరుకి చెల్లిగా చేసిన రమ్యకృష్ణ 'అల్లుడా మజాకా' 'ముగ్గురు మొనగాళ్లు' వంటి సినిమాలో చిరుకి జోడీగా చేసింది.
3) కృష్ణ - సౌందర్య :
'నెంబర్ 1' తో సహా పలు సినిమాల్లో హీరో, హీరోయిన్లుగా చేసిన ఈ జంట 'రవన్న' సినిమాలో అన్న- చెల్లెలు గా చేశారు.
4) రాజేంద్ర ప్రసాద్ - రంభ :
'ఆ ఒక్కటి అడక్కు' సినిమాలో హీరో, హీరోయిన్లుగా నటించారు. వీళ్ళే చిరంజీవి నటించిన 'హిట్లర్' సినిమాలో అన్న - చెల్లెలు గా నటించారు.
5) రమ్యకృష్ణ - నాజర్ :
'బాహుబలి'(సిరీస్) లో వీళ్ళు భార్యాభర్తలుగా చేశారు. అయితే అంతకు ముందు రజినీకాంత్ నటించిన నరసింహ సినిమాలో అన్న చెల్లెలు గా కనిపించారు.
6) ప్రకాష్ రాజ్ - జయసుధ :
'బొమ్మరిల్లు' 'కొత్త బంగారు లోకం' 'మహర్షి' ఇలా చాలా సినిమాల్లో భార్యాభర్తలుగా చేసిన ఈ జంట.. 'సోలో' సినిమాలో మాత్రం అక్క తమ్ముడుగా కనిపించారు.
7) సురేష్ - సౌందర్య :
'అమ్మోరు' సినిమాలో జంటగా నటించారు. అయితే వెంకటేష్ నటించిన 'దేవీపుత్రుడు' సినిమాలో అన్న చెల్లెలుగా కనిపిస్తారు.
8) చంద్రమోహన్ - సుధ :
'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో అన్నా చెల్లెలుగా కనిపించిన ఈ జంట.. రవితేజ నటించిన 'కృష్ణ' సినిమాలో భార్యాభర్తలుగా కనిపిస్తారు.
9) జగపతి బాబు - వాణి విశ్వనాథ్ :
'సింహ స్వప్నం' సినిమాలో జోడీగా నటించారు. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన 'జయ జానకి నాయక' సినిమాలో అన్న చెల్లెలుగా కనిపిస్తారు.
10) చిరంజీవి - నయనతార :
'సైరా' సినిమాలో భార్యాభర్తలుగా కనిపించారు. అయితే లేటెస్ట్ గా వచ్చిన 'గాడ్ ఫాదర్' లో అన్న చెల్లెలు గా కనిపిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: