యువ దర్శకుడికి హ్యాండిచ్చిన చిరు?

Purushottham Vinay
'ఛలో' 'భీష్మ' లాంటి బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుమల.. స్వతహాగా చిరంజీవి కి పెద్ద ఫ్యాన్. కేవలం రెండు సినిమాల అనుభవం ఉన్న దర్శకుడికి.. మెగా ఆఫర్ రావడంతో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడని అందరూ కూడా అనుకున్నారు. దీంతో వెంకీ టాప్ డైరెక్టర్స్ లిస్టులో చేరతాడని అంతా భావించారు.మెగాస్టార్ చిరంజీవి తన డైరెక్షన్ లో పని చేయాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేయడమే కాకుండా.. వెంకీ చెప్పిన బేసిక్ స్టోరీని కూడా ఇష్టపడ్డాడు. ఈ నేపథ్యంలో అధికారికంగా సినిమాని ప్రకటించారు. తన ఫేవరేట్ హీరోతో వర్క్ చేసే అవకాశం రావడంతో వెంకీ ఎంతో ఉత్సాహంగా తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.అయితే మెగా ఆఫర్ అలా వచ్చినట్లే వచ్చి చేజారిపోయినిందని.. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి.మెగాస్టార్ చిరంజీవి ఇటీవల తన మీడియా ఇంటరాక్షన్ లో తాను వెంకీ కుడుముల సినిమాని టేకప్ చేయడం లేదనే విషయాన్ని ధృవీకరించినట్లుగా సమాచారం తెలుస్తుంది.


నిజానికి ఈ సినిమాని అఫిషియల్ గా ప్రకటించారే కానీ.. ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ రాలేదు. అప్పుడే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం కష్టమనే ఊహాగానాలు వినిపించాయి. అయితే ఇప్పుడు వెంకీ ఫైనల్ స్క్రిప్ట్ బిగ్ బాస్ కు నచ్చకపోవడంతో ఈ చిత్రాన్ని పక్కన పెట్టినట్లుగా ఇన్సైడ్ టాక్ నడుస్తోంది.ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంకీ కుడుముల ఇతర హీరోలను సంప్రదించనున్నాడని అంటున్నారు. కాకపోతే ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోలదరూ తమ తమ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇప్పుడు వెంకీ కథను ఓకే చేసినా.. ఈ సినిమా మెటీరియలైజ్ కావాలంటే చాలా టైమ్ పడుతుంది.'భీష్మ' తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న వెంకీ .. అప్పటి నుంచి మెగాస్టార్ మూవీ మీదనే హోప్స్ పెట్టుకున్నాడు. కానీ ఇప్పుడు మళ్లీ నితిన్ ని సంప్రదించనున్నారని సమాచారం తెలుస్తుంది. అంతేకాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను కూడా మెప్పించాలని చూస్తున్నారని రూమర్స్ వస్తున్నాయి.ఏదేమైనా బ్యాక్ టూ బ్యాక్ రెండు సూపర్ హిట్లు అందుకున్న వెంకీ కుడుముల.. ఇప్పటి వరకూ తన తరువాత సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లలేకపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయమే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: