నాకు గొప్ప అందం టాలెంట్ లేకపోవచ్చు... కానీ... జాన్వికపూర్..!

Pulgam Srinivas
బాలీవుడ్ ముద్దు గుమ్మ జాన్వి కపూర్ గురించి కొత్తగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. జాన్వి కపూర్ "ధడక్" మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత పలు మూవీ లలో నటించిన జాన్వి కపూర్ బాలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మోస్ట్ క్రేజీ హీరోయిన్ గా కెరియర్ ను కొనసాగిస్తుంది. కొన్ని రోజుల క్రితమే ఈ ముద్దుvగుమ్మ గుడ్ లక్ జెర్రీ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ కొంతvకాలం క్రితమే డిస్నీ ప్లేస్ హాట్ స్టార్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో విడుదల అయింది. ఇలా ఉంటే తాజాగా జాన్వి కపూర్ "మాలి" అనే మూవీ;లో ప్రధాన పాత్రలో నటించింది. ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో విడుదల కాబోతుంది.

ఇలా వరుస మూవీ లతో ప్రేక్షకులను ఎంతvగానో అలరిస్తూ వస్తున్న జాన్వి కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జాహ్న కపూర్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జాహ్న కపూర్ మాట్లాడుతూ ... తనకు ఈ స్థానం అదృష్టం కొద్దీ, సునాయాసంగా వచ్చిందని భావించడం చాలా పొర పాటు అని జాన్వి కపూర్ తాజాగా పేర్కొంది. తన దగ్గర గొప్ప టాలెంట్, అందం ,  నైపుణ్యాలు లేక పోవచ్చేమో.. కానీ, సెట్ లో చాలా కష్టపడి పనిచేస్తానని హామీ ఇవ్వగలనని తాజా ఇంటర్వ్యూ లో భాగంగా జాహ్న కపూర్ వ్యాఖ్యానించింది. దీన్ని రక్తంతో కూడా రాసివ్వగలనని, తన పని తీరుపై అనుమానమే అక్కర్లేదని జాన్వి కపూర్ తాజాగా పేర్కొంది. ఇది ఇలా ఉంటే ఈ ముద్దు గుమ్మ కు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి కూడా వరుస ఆఫర్ లు వస్తున్నట్లు కొన్ని వార్తలు ఇప్పటికే బయటకు వచ్చాయి. కానీ ఈ ముద్దు గుమ్మ ఇప్పటి వరకు ఏ తెలుగు మూవీ కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికారిక ప్రకటన వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: