ఆచార్య సినిమా దారిలో గాడ్ ఫాదర్ సినిమానా..?

Divya
చిరంజీవి రామ్ చరణ్ కలిసి నటించిన మొదటి చిత్రం ఆచార్య. ఇక ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి నష్టాన్ని తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక విధంగా ఇండియా మొత్తంలో పెట్టుబడి పెట్టిన అత్యధిక స్థాయిలో నష్టపోయిన టాప్-10 చిత్రాలలో ఇది కూడా ఒకటని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా తెలుగులో అయితే అతి పెద్ద డిజాస్టర్ చిత్రంగా నిలిచింది. అయితే ఈ దెబ్బతో చాలా వరకు డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయారు అనే వార్తలు బాగా వినిపించాయి. దీంతో చేసేదేం లేక చివరికి డైరెక్టర్ కొరటాల శివ చాలా వరకు నష్టాలను పూర్తి చేశారు అని సమాచారం.

అయితే ఈ విషయంపై ఎవరు పెద్దగా క్లారిటీ ఇవ్వలేదు. అంతకుముందే ఈ చిత్రంలోని హీరోలు కూడా రెమ్యూనికేషన్ తీసుకోలేదు అనే వార్తలు వినిపించాయి. అయితే రీసెంట్గా చిరంజీవి ఆచార్య సినిమాకు దాదాపుగా 80% పారితోషాకం వెనక్కి ఇచేసినట్లు మీడియాలో అయితే బాగా వార్తలు వినిపిస్తున్నాయి. ఎక్కువగా దర్శకుడు పైన ఈ సినిమా ప్రభావం పడిందని చెప్పవచ్చు. ఇక చిరంజీవి కూడా డిస్ట్రిబ్యూటర్లు అందరిని తీసుకొని సెటిల్మెంట్ చేశారని వార్తలు కూడా గతంలో వినిపించాయి. అయితే ఇప్పుడు మళ్లీ చిరంజీవి ఇలా చెప్పినట్లుగా వార్తలు చాలా వైరల్ గా వినిపిస్తున్నాయి.

ఇక ఇప్పుడు గాడ్ ఫాదర్ చిత్రం సినిమా సక్సెస్ అయినట్లుగా చిత్ర బృందం సభ్యులందరూ తెలియజేస్తున్నారు. కానీ ఈ సినిమాకు కూడా కొంత నష్టాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.చిత్ర యూనిట్ సభ్యులైతే రోజు ఏదో విధంగా ఈ సినిమాని ప్రమోషన్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటివరకు ఈ సినిమాకు పెట్టిన పెట్టుబడిలో ఇంకా పూర్తిస్థాయిలో వెనక్కి రాలేదని వార్తలు కూడా ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. లాభాల సంగతి పక్కన పెడితే నష్టాలు రాకుండ ఉంటే చాలని పరిస్థితి ఇప్పుడు ఈ సినిమాకి ఏర్పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఏ మేరకు గాడ్ ఫాదర్ సినిమా నిలబడుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: