"యశోద" మూవీకి సంబంధించిన ఆ పనులను ప్రారంభించిన సమంత..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ నటీమణులలో ఒకరు అయినా సమంత గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సమంత ఇప్పటికే ఎన్నో మూవీ లలో హీరోయిన్ పాత్రల్లో మరియు ఇతర పాత్రలలో నటించి ఎంతో మంది ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఇది ఇలా ఉంటే పోయిన సంవత్సరం విడుదల అయిన పుష్ప మూవీ లో సమంత ఒక స్పెషల్ సాంగ్ లో నటించి ,  తన అంద చందాలతో ,  డ్యాన్స్ తో ప్రేక్షకుల మనసు దోచుకుంది. పుష్ప మూవీ లోని స్పెషల్ సాంగ్ తో సమంత పాన్ ఇండియా రేంజ్ లో అదిరి పోయే గుర్తింపు ను దక్కించుకుంది.

ఇది ఇలా ఉంటే సమంత తాజాగా యశోద అనే లేడీ ఓరియంటెడ్ మూవీ లో ప్రధాన పాత్రలో నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా  , వాటికి ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్పీడ్ లో జరుగుతున్నాయి.

ఇది ఇలా ఉంటే తాజాగా యశోద మూవీ కి సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. ప్రస్తుతం సమంత "యశోద" మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనులలో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. పోయిన సోమవారం నుండే యశోద మూవీ కి సంబంధించిన డబ్బింగ్ పనుల్లో సమంత పాల్గొంటున్నట్లు తెలుస్తుంది. ఇది ఇలా ఉంటే యశోద మూవీ కి హరి శంకర్ - హరీష్ నారాయణ్ దర్శకత్వం వహించగా , మణిశర్మ ఈ మూవీ కి సంగీతం అందించాడు. ఉన్ని ముకుంద‌న్‌ , వరలక్ష్మి శరత్ కుమార్ , రావు రమేశ్ , మురళీ శర్మ ఈ మూవీ లో ఇతర ముఖ్య పాత్రలలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: