:అందరిని పక్కకు నెట్టి సైలెంట్ గా టాప్ ప్లేస్ కి వెళ్లిన కంటెస్టెంట్..!!

murali krishna
బిగ్ బాస్ సీజన్ 6 లో ఏ నిమిషం ఏం జరుగుతుందో ఊహించడం కష్టంగా మారింది. సెకండ్ సెకండ్ కి టాప్ ప్లేస్ లో ఉన్న కాంటెస్టెంట్ లు మారిపోతున్నారు.
అప్పటి వరకు టాప్ పొజిషన్లో ఉన్న వారు అనుకోకుండా చివరి ప్లేస్ లోకి వెళ్తున్నారు. ఇక దీనికి కారణం హౌస్ లో నెలకొన్న పరిస్థితులే అని అర్థమవుతుంది. తెలిసి తెలియక లేదా తొందరపడి ఏదైనా తప్పు చేస్తే మాత్రం ప్రేక్షకులు వారిని పట్టించుకోవడం లేదు. బిగ్ బాస్ హౌస్ లో ప్రతివారం నామినేషన్ లో ఉన్న కంటెస్టెంట్ లు ఓట్ల కోసం తెగ ఆరాట పడుతూ వారి ఆటతీరును మరింత మెరుగు పరుచుకుని ప్రేక్షకుల మన్ననలు పొందడానికి చూస్తారు. అయితే గత కొన్ని వారాలుగా రేవంత్ ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు.
ఇక ఈ వారం రేవంత్ కెప్టెన్ అయ్యాడు. కాబట్టి అతను నామినేషన్స్ నుంచి సేఫ్. ఇక ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా శ్రీహాన్ టాప్ పొజిషన్ లో ఉండడం గమనార్హం. ఇక రెండో స్థానంలో ఎవరూ అనుకోని విధంగా ఆదిరెడ్డి ఉన్నారు. ఎందుకంటే ఆయన పోయిన వారం మైండ్ గేమ్ ఆడి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ఈయన అత్యధిక ఓట్లు అందుకున్న వారిలో సెకండ్ పొజిషన్ లో ఉన్నారు. అంతేకాదు శ్రీహన్ కి గట్టి పోటి కూడా ఇస్తున్నాడు. ఇక మూడో ప్లేస్లో కీర్తి భట్ ఉంది. ఇక గత వారాలలో ఎక్కువ ఓట్లు అందుకున్న లిస్ట్ నుండి మెల్లిమెల్లిగా గీతూ తన ప్లేస్ ని కోల్పోతుంది. ఆమెకు ప్రేక్షకులనుండి ఓట్లు తగ్గుతున్నట్లు తెలుస్తోంది. ఇక తాజాగా గీతూ నాలుగో స్థానంలో కొనసాగుతోంది.
ఐదో ప్లేస్ లో రాజశేఖర్ ఉన్నారు. ఈయనకు గతంలో కంటే మంచి ఓట్లు పడుతున్నాయి. కానీ ఆయన ఆట తీరు మరింత మెరుగుపరుచుకోవాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. ఇక ఆరో ప్లేస్ లో శ్రీ సత్య ఉంది. ఈమె అర్జున్ తో నడిపించే ఒక వెరైటీ లవ్ ట్రాక్ వల్ల బాగానే క్రేజ్ తెచ్చుకుంటుంది. ఆ తర్వాత మెరీనా ఏడో ప్లేస్ లో ఉంది. ఇక అతి తక్కువ ఓట్లు అందుకున్న వారిలో బాలాదిత్య,సుదీప ఉన్నారు. బాలాదిత్య గత వారాల్లో మంచి ఓట్లు అందుకొని టాప్ పొజిషన్ లో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఆయనకు ఓట్లు తగ్గాయి. ఇక సుదీప ఎప్పటిలాగానే అందరి కంటే చివరి ప్లేస్ లో ఉంది. ఈమెకు అందరి కంటే తక్కువ ఓట్లు ఉన్నాయి. ఇక ఈ వారం సుదీప ఎలిమినేట్ అవుతుంది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: