"జిన్నా" మూవీ నుండి రఘుబాబు కు సంబంధించిన క్యారెక్టర్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
టాలీవుడ్ ఇండస్ట్రీ లో హీరోగా తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న మంచు విష్ణు తాజాగా జిన్నా అనే మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కి సూర్య దర్శకత్వం వహించగా ,  సన్నీ లియోన్ ,  పాయల్ రాజ్ పుత్ ఈ మూవీ లో మంచు విష్ణు సరసన హీరోయిన్ లుగా నటించారు. ఈ మూవీ ని అక్టోబర్ 21 వ తేదీన తెలుగు ,  మలయాళ ,  హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ లభించింది.
 

ఇప్పటి వరకు చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఉండడంతో జిన్నా మూవీ పై ప్రేక్షకులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా జిన్నా మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అప్డేట్ విడుదల చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ మూవీ లో రఘుబాబు క్యారెక్టర్ కు సంబంధించిన పోస్టర్ ని విడుదల చేసింది. రఘుబాబు ఈ మూవీ లో రంగంపేట ప్రెసిడెంట్ తిప్పే స్వామి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలియ జేస్తూ రఘుబాబు కు సంబంధించిన ఒక పోస్టర్ ను జిన్నా మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఈ పోస్టర్ లో రఘుబాబు నిలబడి దండం పెడుతూ  ఉన్నాడు. ఈ మూవీ ని దర్శకుడు హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కించాడు. ఈ మూవీ లో సునీల్, నరేష్, వెన్నెల కిషోర్, చమ్మక్ చంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తూ ఉండగా ,  ఈ మూవీ కి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. ఈ మూవీ ని AVA ఎంటర్టైన్‌మెంట్ మరియు 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకాల పై సంయుక్తం గా నిర్మించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: