ఆ రోజుల్లో "అరుంధతి" మూవీ ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధించిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!

Pulgam Srinivas
మోస్ట్ టాలెంటెడ్ నటి మానులలో ఒకరు అయినటు వంటి అనుష్క గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనుష్క ఇప్పటికే తన కెరియర్ లో ఎన్నో కమర్షియల్ మూవీ లలో హీరోయిన్ గా నటించి ,  తన అందచందాలతో ప్రేక్షకులను అలరించడం మాత్రమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన పాత్ర లలో నటించి తన నటన తో కూడా ఎంతో మంది ప్రేక్షకులను అలరించింది. ఇది ఇలా ఉంటే అనుష్క కెరియర్ లో అద్భుతమైన మూవీ గా అరుంధతి మొదటి స్థానంలో నిలుస్తుంది. అన్న విషయాన్ని ప్రత్యేకంగా చేయాల్సిన అవసరం లేదు.

అరుంధతి మూవీ కి ముందు వరకు ఒక కమర్షియల్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న అనుష్క "అరుంధతి" మూవీ తర్వాత ఒక వైవిధ్యమైన నటిగా పేరు తెచ్చుకుంది. అరుంధతి మూవీ తో అనుష్క తన క్రేజ్ ను అమాంతం పెంచుకుంది. ఇది ఇలా ఉంటే అరుంధతి మూవీ కి కోడి రామకృష్ణ దర్శకత్వం వహించగా , శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఈ మూవీ ని అత్యంత భారీ బడ్జెట్ తో ,  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించాడు. ఇది ఇలా ఉంటే అరుంధతి మూవీ 16 జనవరి 2009 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

ఈ మూవీ కి కోటి సంగీతాన్ని అందించాడు. కోటి ఈ మూవీ కి అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో కీలక పాత్రను పోషించింది.  ఇది ఇలా ఉంటే ఈ సినిమా సాధించిన కలెక్షన్ ల వివరాల్లోకి వెళితే ... ఈ మూవీ ఆ సమయం లోనే 45 కోట్ల షేర్ కలెక్షన్ లను మరియు 75 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసులు చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గ నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: