గీతూ రాయల్ పేరు చెప్తే మండి పడుతున్న బాలాదిత్య భార్య...!!!

murali krishna
బిగ్ బాస్ సీజన్ 6 లో అందరికంటే మంచివాడు ఎవరు అంటే కళ్ళు మూసుకొని చెప్పే పేరు బాలాదిత్య. ఈవారం ఎలిమినేట్ అయినా చలాకి చంటి కూడా ఇదే మాట చెప్పాడు అయితే అది పూర్తిగా మేకప్ అని అది బయట తీసిన రోజు బాలాదిత్య అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది అంటూ చెప్పాడు చంటి.షో మొదలైన 5 వారాల తర్వాత ఆయనలో కోపం బయటికి వచ్చింది అప్పటి వరకు లోపల అసలు కోపమే లేనట్టు చాలా శాంతంగా, ప్రశాంతంగా కనిపించాడు బాలాదిత్య. చివరకు ఆయనకు కోపం తెప్పించిన ఘనత మాత్రం గీతు సొంతమైంది. ఇదిలా ఉంటే బాలాదిత్య, గీతూ మధ్య జరిగిన గొడవ వాళ్ల కుటుంబాల వరకు వెళ్లిందని..
గీతూ పేరు చెప్తే చాలు బాలాదిత్య భార్య మండిపడుతుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.గత వారం టాస్క్ లో భాగంగా బాలాదిత్య మాట్లాడుతున్నప్పుడు.. మధ్యలో గీతూ ఏదో మాట్లాడబోతుండగా.. తప్పు.. తప్పు అది.. నీకు అర్థం కాకపోతే హేళన చేస్తావా అని వేలు చూపిస్తూ గీతూకి గట్టిగానే వార్నింగ్‌ ఇచ్చాడు బాలాదిత్య. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. మరోవైపు బిగ్ బాస్ ఇంట్లో అందరినీ వేరువేరుగా చూసే గీతూ.. కేవలం బాలాదిత్యను మాత్రమే తన ఫ్యామిలీ మెంబర్ అని చెప్పింది. ఆయనను నోరార అన్నయ్య అని పిలుస్తుంది. నేను అంతగా ఇష్టపడే నిన్ను ఎందుకు తక్కువ చేస్తాను అన్న అని చెప్పబోతుంటే కూడా బాలాదిత్యా ఏమాత్రం వినలేదు. గొంతు లేపడం ఒక్కటే గొప్ప కాదు ఆపు.. వింటున్నా.. అన్నీ వింటున్నా.. ఆట పట్టించడానికి అయినా లిమిట్‌ ఉంటుంది..అది దాటితే ఇలాగే ఉంటుంది అంటూ సీరియస్‌ గా గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు బాలాదిత్యా. ఇది విన్న తర్వాత గీతూ కూడా బాగానే హర్ట్ అయింది. ఎందుకంటే అంతకు ముందు వారం తనకు ఓ టాస్క్ లో భాగంగా డబ్బులు ఇవ్వలేదని కోపం బాగా పెట్టుకుంది గీతూ. ఇప్పుడు అందరి ముందు బాలాదిత్య అర్చేసరికి విషయం ఇంకా పెద్దదయింది. పైగా తన చదువును హేళన చేసింది అంటూ ఆమెపై మండిపడ్డాడు బాల. ఇదే విషయంపై బయట బాలాదిత్య భార్య కూడా గీతూను తప్పు పట్టిందని తెలుస్తోంది. ఇంట్లో అనవసరంగా రెచ్చగొడుతూ అందరి మధ్య గొడవలు పెడుతుందని ఈమె గీతు గురించి చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: