ఈ వారం బిగ్ బాస్ నామినేషన్ లో ఉన్నది ఎవరో తెలుసా?

Satvika
బిగ్ బాస్ సీజన్ 6 ఇప్పుడు ఇంకాస్త ఎక్కువ జోష్ తో ముందుకు వెళ్తున్న సంగతి తెలిసిందే..ఇప్పటికే ఐదు వారాలు పూర్తీ చేసుకున్న సంగతి తెలిసిందే..తాజా ఉదాహరణగా కీర్తి భట్, ఆదిరెడ్డి ప్రముఖంగా నిలిచారు.బిగ్ బాస్ షోలో మూడో కెప్టెన్ గా ఆదిరెడ్డి ఎంపిక కాగా అతని తర్వాత మొదటది మహిళా కెప్టెన్ గా కీర్తి భట్ బాధ్యతలు చేపట్టింది. ఆది రెడ్డి కెప్టెన్ గా ఫెయిల్ అంటూ ఏకంగా నాగార్జునే చెప్పగా, ఈ వారం నామినేషన్స్ లోనూ అదే భావనతో అతన్ని అత్యధికంగా ఏడు మంది నామినేట్ చేశారు. ఇదే పరిస్థితి కీర్తి భట్ కూ వచ్చింది. చలాకీ చంటీ హౌస్ నుండి ఎలిమినేట్ కావడానికి పరోక్షంగా కీర్తినే కారణమంటూ గీతు వంటి వారు విమర్శించారు.

అలానే కెప్టెన్ గా ఆమె కూడా సరైన పనితీరు కనబర్చలేదంటూ ఏడుగురు నామినేట్ చేశారు. ఆరు నామినేషన్స్ తో గీతు; మూడు నామినేషన్స్ తో బాలాదిత్య, రాజ్; రెండేసి నామినేషన్స్ తో సుదీప, శ్రీహాన్; ఒక్కో నామినేషన్ తో మెరీనా, శ్రీసత్య ఈవారం నామినేషన్స్ జాబితాలో నిలిచారు..కెప్టెన్ గా ఉన్న కారణంగా రేవంత్ కు నామినేషన్స్ నుండి వెసులుబాటు కలిగింది. ఫైమా, వాసంతి, ఆర్జే సూర్య, ఇనయా, అర్జున్ లను ఎవరూ నామినేట్ చేయలేదు. ఈ సందర్భంగా అర్జున్ హౌస్ మొత్తానికీ ఓ క్లారిటీ ఇచ్చాడు. తనకు శ్రీసత్యకు మధ్య ఉన్నది ప్యూర్ ఫ్రెండ్ షిప్ అని, ఆమె కారణంగా తాను బలహీన పడ్డానని అనడం, ఆమెకు ఫేవర్ గా ఆడుతున్నానని విమర్శించడం సరికాదని తెలిపాడు. నిజానికి శ్రీసత్య తన బలం తప్పితే, బలహీనత కాదని స్పష్టం చేశాడు.


ఇకపోతే డాన్స్ రాదనే కారణంగానూ, వినోదాన్ని సరిగా పంచలేదనే కారణంగానూ ఆదిని ఎక్కువ మంది నామినేట్ చేస్తే, ఎప్పటిలాగే గీతూ యాటిట్యూడ్ నచ్చక ఆమెను కొందరు నామినేట్ చేశారు..అయితే…. ఎవరిని ఎవరు ఎందుకు నామినేట్ చేశారనే విషయంలో రాబోయే రెండు రోజులు హౌస్ లో ఆసక్తికరమైన చర్చలు జరగడం ఖాయం. మరి హౌస్ మెంబర్స్ నామినేట్ చేసిన తోటి సభ్యులను ఎలా కన్వెన్స్ చేస్తారో చూడాలి..మరి ఎలిమినేషన్ ఎవరికీ వరిస్తుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: