"నేను స్టూడెంట్ సార్" మూవీ నుండి అవంతిక దాసాని ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల..!

Pulgam Srinivas
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తమ్ముడు బెల్లంకొండ గణేష్ తాజాగా స్వాతిముత్యం అనే మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ మంచి అంచనాల నడుమ అక్టోబర్ 5 వ తేదీన ధియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ ధియేటర్ లలో విడుదల అయిన స్వాతిముత్యం మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకొని బాక్సా ఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ ను అందుకుంది. అలా స్వాతిముత్యం మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ టాక్ రావడంతో ప్రస్తుతం ఈ మూవీ కి బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లు కూడా దక్కుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఎంట్రీ ఇచ్చిన మొట్ట మొదటి మూవీ తోనే బాక్సా ఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకున్న బెల్లంకొండ గణేష్ ప్రస్తుతం నేను స్టూడెంట్ సార్ అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు.
 

ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను విడుదల చేసింది. నేను స్టూడెంట్ నే సార్ మూవీ లో అవంతిక దాసాని ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని మూవీ యూనిట్ విడుదల చేసింది. అలాగే అవంతిక దాసాని ఈ మూవీ లో శృతి వాసుదేవన్ అనే పాత్రలో కనిపించబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ యూనిట్ విడుదల చేసిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ లో అవంతిక దాసాని జీన్స్ ప్యాంట్ వేసుకొని జీన్స్ షర్ట్ ని ధరించి అదిరిపోయే మోడరన్ లుక్ లో ఉంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాఖీ ఉప్పలపాటి ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తూ ఉండగా , మహతి స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతాన్ని అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: